పుట:2015.329863.Vallabaipatel.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

3

“పరులవాదన కాయన త్వరగా లొంగనివాఁడు. అవసరమేమో, యనవసరమేమో తెలిసికొనగల విచక్షణ యాయనకుఁ గలదు. అవసరమని భావించినచో నిఁక బట్టు విడువఁడు. ఎప్పుడు నొక సూత్రముపైఁ బోరాడును. పోరాడ నారంభించినచో సర్వశక్తులను వినియోగించును. చీట్లాటలో నైనను, చపాతీలలో నైనను, వాగ్వివాదములో నైనను నిదియే యాయన తత్త్వము. జయమందుటయే యాయన లక్ష్యము. చర్చలలోఁ గానిండు, ఎన్నికలలోఁ గానిండు, విజయమునకై యాయన మహాతురత నొందును. అప్పట్టున నాయన యోర్మి పూర్తిగా నశించును. ఒక్కొకప్పుడు ప్రతిపక్షము నేమాత్రము సహింప లేఁడు. ప్రతిపక్షులను గటువుగా, పరోచకమైనవిధముగా మాటలాడి నొప్పించు తత్త్వము. కాని తన చమత్కృతితోఁ దెలివితేఁటలతోఁ బ్రతిపక్షులయందు విద్వేషభావము కలుగకుండఁ జేసికొనిపోఁగల దిట్ట.”

ఆజాద్‌వలె సర్దారు పాండితీప్రకర్షకలవాఁవాడు కాఁడు. కాని యపారమైన ప్రపంచజ్ఞానముకలవాఁడగుటచేఁ బాండిత్య లోపము బయటపడదు.

జవహరులాలువలె విస్తృతముగ విదేశములలోఁ బర్యటనచేసినవాఁడు కాఁడు. కాని చక్కని యూహశక్తి కలవాఁడు.

సుభాషబాబువలె ననిర్దిష్ట సాహసోపేతకార్యములకుఁ గడంగఁడు. తన కార్యాచరణప్రణాళికను ముందుగనే సిద్ధము చేసికొని దానిని నిరంతరాయముగ ననుసరించును.

రచన తక్కువ - కాని కాగితముపైఁ గలముపెట్టిన