పుట:2015.329863.Vallabaipatel.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

45

వ్యతిరేకు లాయనను ఫాసిస్టని, కులక్ అని, డిక్టేటరని, యుక్కుమానిసి యని యెంత నిందించినను నాయన వాని నన్నిటి నోర్చి, కాంగ్రెసులోఁ గ్రమశిక్షణ యతిజాగృతితో నిలిపి కాంగ్రెసును గాపాడుటలో నధికఖ్యాతిఁ గాంచెను.

తాఖీదు లిచ్చుటతోనేతనపని పూర్తియైన దనితలంచు ఘటముకాదు పటేలు. తాను బూనినకార్యము, నెగ్గువఱకు నిరంతరప్రయత్నము చేయు నిరుపమాన కార్యదక్షుఁడు. బొంబాయిలో మద్యపాననిషేధోద్యమమునకు వ్యతిరేకముగాఁ గంట్రాక్టరులగు పార్సీలు మొదలగువారు పలుప్రయత్నములు చేయఁగా నచటఁ బ్రవేశించి మద్యపాననిషేధోద్యమము నమలుజరిపించి జయప్రదముగాఁజేసిన యాయన భగీరథప్రయత్నము భారతలోకమునకుఁ దెలియనిదికాదు.

అండమానురాజకీయబందీలు నిరశనవ్రత మవలంబించఁగా వారిని వదలిపెట్టుటకుఁ గేంద్రప్రభుత్వమున కిష్టములేక పోయినను, వారిని విడిచిపెట్టుటకు వీలులేకపోయినను మన కీ రాష్ట్రీయస్వాతంత్ర్య మెందుకని హెచ్చరించి, వారిని విడిచి పెట్టించిన స్వాతంత్ర్యప్రియుఁడు సర్దారు.

1945లోఁ గేంద్రశాసనసభాధ్యక్షపదవికిఁ గాంగ్రెసును మప్లంకరును నిలుపగా, ముస్లింలీగువారు, ప్రభుత్వము భుజాలు భుజాలు కలిపి పనిచేయఁగా నక్కడఁ బీఠముపెట్టి మప్లంకరును బీఠమెక్కించి ఢిల్లీకోటలో బాగావేసిన విజయసారథి - సర్దారు.

కాంగ్రెసులో నాయనపాత్ర యతిప్రముఖమైనది. క్రిప్సు రాయబారములో నేమి, యమాత్యత్రయదౌత్యములో