పుట:2015.329863.Vallabaipatel.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

వల్లభాయిపటేల్

బ్రయత్నించఁగా వల్లభాయి వల్లగాదని తంతి నంపి, యాపించెను.

సుభాషబాబు కాంగ్రెసుపాలసీకి భిన్నముగాఁ బ్రవర్తించినందుకు రెండు సంవత్సరము లాయనను డిబారు చేసెను.

కాంగ్రె సవలంబించిన పద్ధతికి వ్యతిరేకముగా రాజాజీ ప్రచారముప్రారంభించినప్పుడు శాసనసభ్యత్వమును వదలుకొనుమనియేగాక, కాంగ్రెసు నుండి తప్పుకొనవలసినదనియే తాఖీదు పంపెను. ఆప్రకారమే చక్రవర్తులవారు చేసిరి.

ఈ విధముగా వేయికండ్లతోఁ జూచుచుఁ గాంగ్రెసులోఁ గ్రమశిక్షణను గాపాడిన ఖ్యాతి యాయనకే యధికముగ చెల్లుబడియైనది.

స్వధర్మనిర్వహణలో మిత్రుఁడనిగాని, పెద్దయనిగాని తలఁచక, యాయనచూపిన కర్తవ్య నిర్వహణబుద్ధియే యాయన నధికునిగాఁ జేసినది. ఆయన ద్వంద్వాతీతుఁడై చేసిన సేవకుఁ గొందఱకుఁ గష్టము కలుగవచ్చును. కొందఱకు నష్టము కలుగవచ్చును. కాని కాంగ్రెసునుమాత్ర మాయన దుష్టాంగమును ఖండించి, శేషాంగమును గాపాడినట్లుగాఁ గాపాడినాఁడు. ఆయన యా విధముగ దారుణచర్య తీసుకొనక పోయినఁ గాంగ్రెసు శాసనసభాపక్షము, స్వరాక్ష్యపక్షమువలె ఛిన్న భిన్నమై నశించిపోయియుండును.

ప్రభుత్వ మీ కాంగ్రెసు సభ్యులను లోఁబఱచుకొనుట కెన్ని మాయోపాయములు పన్నినను వాని నన్నిటిని వేయికండ్లతోఁ జూచుచు నెప్పటికప్పుడు మెలకువతోఁ బటేలు సంచరించుటవలననే కాంగ్రెసు ప్రతిష్ఠ నిలచినది.