Jump to content

పుట:2015.329863.Vallabaipatel.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

139

గాని, సామాజికాభివృద్ధికి "ధనికవాద మవసర"మని యతఁడు భావించుననుట నిజము. నూతనసామాజికవ్యవస్థలోఁ గార్మికవర్గప్రాముఖ్యమును గుర్తించుటకే యాయన చాలకాలము నిరాకరించెను. అదే యాయనలోని గొప్పలోపము. నెహ్రూ యొక యాదర్శవాది. పటే లనుష్టానవేత్త.

దై నందిన వాస్తవిక రాజకీయములలో నెహ్రూపటేలు లిద్దరు సుస్థిరస్థానములలోనే యున్నారు. కాంగ్రెస్ తలపెట్టిన ప్రతి నూతనవిధానములోను నెహ్రూ గాంధీజీతో నేకీభవించెడువాఁడు. క్రమేణ ప్రజానీకము నెదుట నాయన గాంధీజీ ముఖ్యప్రతినిధి యైనాఁడు. పటేల్ సంచాలకుఁ డైనాఁడు. నెహ్రూ ప్రజానీకమునకే చిహ్నమైనాఁడు. ఈ పదవి వెనుక నధికారమంతయుఁ బటేల్‌చేతిలోనున్నది. వీరిద్దరు గాంధీజీతో నేకీభవించినది క్రిప్సురాయబారపు సమయములో దేశవిభజన ప్రసక్తి వచ్చినప్పు డొక్కపర్యాయముమాత్రమే. కాంగ్రెసు భవిష్యత్తును గుఱించి చర్చలు జరుగుచున్నప్పుడుకూడ వీరిద్దరు గాంధీజీతో నేకీభవించలేదు. కాంగ్రెసు భవిష్యత్తు విషయమై గాంధీజీకిఁ గొన్ని స్పష్టమగు నుద్దేశము లుండెను. కాని వీరిద్దరిని మహాత్ముఁడు చక్కగా సమన్వయపఱచి, కలసికట్టుగఁ బని చేయించఁగలిగెను. కార్మికసమస్యలు, పరిశ్రమలను జాతీయ మొనర్చుట మొదలగు ముఖ్యసమస్యలపై గాంధీజీ యభిప్రాయములను గాంగ్రెసు సంప్రదాయమును రూపుదిద్దుటలో నెహ్రూకుఁ జాలప్రాబల్య ముండెననుటకూడ వాస్తవమే.