పుట:2015.329863.Vallabaipatel.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[2]

వల్లభాయిపటేల్

9


విద్యార్థిదశ

వల్లభాయి బాల్యములోఁ దండ్రివెంటఁ బొలము వెళ్లు చుండెడివాఁడు. తండ్రి కొలఁదిగాఁ జదివికొన్నవాఁ డగుటచేత నింటియొద్దఁ బాఠము లన్నిటి నక్కడఁ గంఠస్థము చేయించు చుండెను. ఇట్లు కొంతకాలమైనతరువాత నాతఁడు వల్లభాయిని నడియాడ్‌లోని యాంగ్లపాఠశాలకుఁ బంపెను.

బాల్యమునుండి పటేలు మంచిచుఱుకు, కఱకు గలవాఁడు. చదువుసంధ్యలలో నందఱకంటె నధికుఁడేకాని మిక్కిలిపెంకె.

ఒకసారి లెక్కలమాస్ట రింటివద్దఁ బది లెక్కలు చేసికొని రమ్మనఁగాఁ జేసికొనిరాలేదు. ఆయనకు లెక్కలు బాగుగానేవచ్చును. క్లాసులో లెక్కలు బాగుగనే చేయుచుండెను. అందుచేతనే యాయన యా లెక్కలు చేసికొని రాలేదు. అయినను దాను జెప్పినట్లు చేయనందులకుఁ బంతులు కోపించి మఱునాఁడు మఱల నా పదిలెక్కలను జేసికొనిరమ్మనిచెప్పెను. ఆనాడు పటే లొకగణికపుస్తకమును దీసికొని ‘యిదిగో! పంతులుగారు! ఇందుఁ జాలలెక్కలున్న’ వని చూపించెను.

ఆయన నడియాడ్‌లోఁ జదువుచున్న రోజులలో మఱియొక ఘట్టము జరిగినది. నేటికిఁగూడఁ గొన్ని స్కూళ్లలో జరుగుచున్నట్లే యాస్కూలులోఁగూడ నుపాధ్యాయుఁడు పుస్తకము లమ్ముచుండెను. ఇందువలన నాయనకుఁ గొంచెమో గొప్పయో లాభము ముట్టుచుండెను. తన వద్దనే పుస్తకము