పుట:2015.329863.Vallabaipatel.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

వల్లభాయిపటేల్


లను గొనుఁడని యాయన పిల్లలను దబాయించుచుండెను. మన పటేలు చిన్నతనములోనే యీ పంతులయొద్ద నెవ్వరును బుస్తకములను గొనఁగూడదని యొక పితూరీ లేవఁదీసెను. ఆ నాయకుని యాజ్ఞానుసారముగాఁ బిల్లలందఱును బుస్తకములు కొనకుండుటయేగాక, సమ్మెకూడఁ చేసిరి. ఇట్లయిదాఱురోజులు సమ్మె జరుగువఱ కా పంతులు లొంగివచ్చి మీ యిష్టము వచ్చినచోటఁ బుస్తకములు కొనవచ్చునని యంగీకరించెను. తమకోరిక నెఱవేఱగాఁ బటేలు పరామర్శతోఁ బిల్లలందఱును బడికి వెళ్లిరి.

నడియాడ్‌లో విద్యాభ్యాసమైన తరువాత వల్లభాయి ‘బడౌదా’ పాఠశాలలోఁ బ్రవేశించెను. సంస్కృతము చదువుట యాయనకిష్టములేదు. అది చాలాకష్టమైన భాషగా నాయనకుఁ దోఁచినది. అందుచేత మెట్రిక్ పరీక్షలో నాయన గుజరాతినే తీసికొనెను. ‘చోటేలాల్‌’ అను ఉపాధ్యాయుఁ డాయనకు గుజరాతి చెప్పుచుండెను. కాని యాయనకు సంస్కృత మనిన నమితప్రేమ. సంస్కృతము చదువనివారిని హేళన చేయు చుండెడివాఁడు. వల్లభాయి యాయన క్లాసులోఁ బ్రవేశింపఁగనే వ్యంగ్యముగా ‘దయచేయుఁడు, మహాపురుషు’లని యాయన హేళనచేసెను. వ్యంగ్యముగా నుడివిన యా వాక్యమే యథార్థమగునని యా పంతు లేమి యెఱుఁగును?

పటేలు కప్పుడు పదుమూడు, పదునాలుగేండ్లు - ఆఁతడు క్లాసులోఁ బ్రవేశింపఁగనే యుపాధ్యాయునకు నతనికి నీ సంభాషణము జరిగెను.

“ఎక్కడనుండి వేంచేసితిరి?”