పుట:2015.329863.Vallabaipatel.pdf/120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
[15]
113
వల్లభాయిపటేల్

కరాచీ రాజధానిగా సింధు, సరిహద్దురాష్ట్రము, పశ్చిమ పంజాబు, తూర్పుబెంగాలు, (సిల్హటుజిల్లాతోసహా) పాకిస్థానధినివేశముగా 1947 ఆగస్టు 15 వ తేదీన నవతరించెను.

1947 ఆగస్టు 15 వ తేదీన భారతదేశ విభజనయు, స్వాతంత్ర్యమును నొక్కసారిగా నేర్పడినవి. భారతదేశములోఁ గొంతభాగము పరాయి ప్రాంతముగ విభజింపఁబడినను, కొన్ని శతాబ్దములనుండి పరపాలనకు లోఁబడినదేశము. స్వతంత్రము పొందినది. మౌంటుబాటెన్ భారతాధినివేశమునకు గవర్నర్ జనరల్‌గా నియమితుఁడయ్యెను. పాకిస్థాన్‌కు జనాబ్‌జిన్నా గవర్నర్ జనర లయ్యెను.

క్రొత్తరాజ్యాంగ పరిషత్తు 1947 ఆగస్టు 14 వ తారీఖున రాత్రి సమావేశమయినది. ఆ శుభముహూర్తమునకు మన స్వాతంత్ర్య రాజ్యచిహ్నముగ ధర్మచక్రగర్భితమగు త్రివర్ణ పతాకమును సర్వసమ్మతితో రాజ్యాంగభవనముమీద నెహ్రూ ప్రతిష్ఠించెను. ఆ పరిషత్తువారు నెహ్రూను నాయకుఁడుగ నెన్నుకొనిరి. నెహ్రూ, వల్లభాయి నుపప్రధానిగను, మఱి కొందఱును వివిధశాఖామంత్రులుగను నెన్నుకొనెను.

ఉపప్రధానిగాఁ బటేల్ సంస్థానములు, దేశీయ ప్రచురణ శాఖలు చూచుచుండెను.

భారతదేశము స్వాతంత్ర్యము గాంచినందుకు బ్రపంచ మంతయు బ్రశంసించెను. భారత దేశమునఁగూడ, నానందోత్సవములు జరిగెను. అయినను దేశ మొకవంక విభక్త మైనదను దుఃఖము వెన్నాడుచునే యుండెను. స్వాతంత్ర్యానంతరము కూడః బెక్కుచోట్ల హత్యలు, గృహదహనములు, దోపిళ్లు,