పుట:1857 ముస్లింలు.pdf/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

స్వచ్చమైన ఇస్లాం ఆచార సాంప్రదాయాలను ప్రజల చేత అనుసరింప చేయాలన్న ప్రదానఉద్దేశ్యంతో ధార్మికవేత్తలు తమ ఉద్యమాలను ఆరంభించినప్పటికీ ఆ తరువాత ప్రజలధార్మిక విషయాలలో ఆంగ్లేయుల జోక్యం, ఆంగ్లేయాధికారుల దోపిడి, వలస పాలకులరాజ్యవిస్తరణ కాంక్షకు తమ ప్రజలు, తమ ప్రదృశాలు, తమ ధార్మిక సంస్థలు గురికావడంగమనించి అచిరకాలంలో ఆ తిరుగుబాట్లు కాస్తా తమ దశను-దిశను మార్చుకున్నాయి.ఈ ధార్మిక పండితులంతా బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడటం ముస్లింల ధార్మిక విధిగా కూడ ప్రకించటంతో ప్రజల బౌతిక అవసరాలు, ఆధ్యాత్మిక ఇక్కట్లు ప్రజలను తిరుగుబాటు మార్గం పట్టించాయి. ఆధ్యాత్మిక మార్గదర్శ నం తోపాటుగా పరాయి పాలకులదాస్యం నుండి విముక్తి కల్పించాలన్న మహత్తర లక్ష్యంతో ఆ ప్రజా ఉద్యమాల నాయకులు కంపెనీ పాలకులు, ఆ పాలకుల తొత్తుల మీద పోరాటాలకు బాటలు వేశారు.

పోరుబాట నడపమంటూ ప్రజలకు పిలుపు

షా వలియుల్లా లాంటి ధార్మికవేత్తల ప్రబోధాల అనుసారంగా హజీ షరియతుల్లా, సయ్యద్‌ అహ్మద్‌ బరేల్విలు చూపిన బాటలో ఆయా ధార్మికవేత్తల అనుచరగణం నాటి పోరాట స్పూర్తిని వారసత్వంగా స్వీకరించి స్వేచ్ఛా-స్వాతంత్య్రాల కోసం తమ ప్రాణాలను బలిపెడుతూ ముందుకు సాగింది. ఆ క్రమంలో అలనాటి పోరాట యోదుల వారసులు 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో కూడ ప్రవేశించారు.

ప్రజలను పోరాట దిశగా నడిపించేందుకు బలమైన ఆధ్మాత్మిక ఇంధనాన్ని అందించటం మాత్రమే కాకుండా ఆంగ్లేయ వ్యతిరేకత ప్రదాన చోదకశక్తిగా ధార్మికవేత్తలు 1857నాటి పోరాటంలో బహుళ పాత్రలను సమర్థవంతంగా పోషించారు. పలు ప్రాంతాలలో మౌల్వీలు సాయుధంగా విముక్తి పోరాటంలో స్వయంగా పాల్గొన్నారు. తిరుగుబాటు యోధులతో కలసి తమ సొంతగడ్డకు స్వేచ్ఛా-స్వాతంత్య్రాలను ప్రసాదిం చేందుకు ఆయుధం చేబ్టారు. మరికొన్నిచోట్ల ఆయుధధారణ చేయడం మాత్రమే కాకుండ ఆంగ్లేయుల నుండి విముక్తి పొందిన ఆ ప్రాంతాల పరిపాలనా భారాన్ని కూడ స్వీకరించి విజయవంతంగా నిర్వహించారు. ఇంకొన్ని చోట్ల స్వదేశీ పాలకులు సాగించిన

90