పుట:1857 ముస్లింలు.pdf/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మౌల్వీలు

పాలకులవైపు గురి పెట్టబడ్డయి. ఈ విధంగా ముస్లింల ఆచార సంప్రదాయాలలో ఖచ్చితంగా పాటించాల్సిన పద్దతులను నిర్దేశిస్తూ, పరాయి పాలకులైన ఆంగ్లేయుల మీద పోరాటాన్ని ఫర్జ్‌ గా ప్రకటించినందున ఈ ఉద్యమం ఫరైజీ ఉద్యామంగా చరిత్రలో ఖ్యాతిగాంచింది.

ఈ ఉద్యమానికి హాజీ పీర్‌ షరియతుల్లా శ్రీకారం చుట్టినప్పటికీ ఆ ఉద్యమాన్ని సమరశీల పోరాటంగా మార్చి బ్రిటిషర్లను ఖంగు తిన్పించిన మహాయోధుడు దూదుమియా (1819-1859). ఆయన నేతృత్వంలో రైతాంగం, వివిధ వృత్తుల సామాన్యప్రజలు, పలు సాంఫిుక జనసమూహాలు కలసికట్టుగా ఆయన వెంట నడిచారు. ఆ

1857 ముస్లింలు.pdf
                ఆంగ్ల సైన్యాలతో పోరాడుతున్న యోధులు

కారణంగా అతి త్వరలో ఫరాజీల పోరాటం పలు ప్రాంతాలకు వ్యాపించి 1830 నుండి1900 వరకు సాగింది. ఈ పోరాటంలో దూదు మియాకు వారసులుగా నోయామియా, బనీ అమీర్‌ మియా తదితరులు ప్రధాన భాగస్వామ్యం వహించారు.

1857 నాటి పాత్ర

1857 నాటికి చాలా పూర్వమే చిగురుతొడిగి, బ్రిటిషర్లను తీవ్ర ఆందోళనకు గురిచేసిన ఈ పోరాటాలు ప్రారంభదశలో మతం పునాదుల మీద, మత సంస్కరణలుప్రధాన లక్ష్యంగా, ధార్మిక పండితుల నాయకత్వంలో ఆరంభం కావటం గమనార్హం

89