పుట:1857 ముస్లింలు.pdf/94

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మౌల్వీలు

పోరుకు సంపూర్ణంగా నైతిక మద్ధతు ప్రకటిస్తూ ఆయుధాల స్థానంలో అక్షరాలతో ప్రచారంచేసి తగిన తోడ్పాటునందించారు.

బదర్‌ విజయం ప్రేరణ

ఆంగ్ల ప్రభుత్వం మీద పోరాటం గురించి ఆలోచనలు చేస్తున్నమౌల్వీలు 1856లో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మౌలానా హాజి ఇమ్‌దాదుల్లా ముహాజిర్‌, మౌలానా ఖాసిం నానాతవి, మౌలానా రషీద్‌ అహ్మద్‌ గంగోహీ, మౌలానా జాఫర్‌ థానేశ్వరి, మౌలానా ముహమ్మద్‌ హఫీజ్‌ జమీర్‌ అహ్మద్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మౌలానా ఖాసిం నానాతవి ప్రసంగిస్తూ బ్రిటిషు వారు మన నెత్తి మీద కూర్చున్నవిషయం మీకు తెలియదా ?బ్రిటిష్‌ వారు భారత దేశం పై పూర్తిగా తమ పరిపాలనాధికారపు వలను పరిచియున్నారు. వారి బానిసత్వం నుంచి విముక్తిని పొందగోరుతున్నట్టయితే నిర్ణయాత్మక పోరాటంలో పాల్గొనండి. బ్రిటిషువారితో పోరాడుదాం. లేదా మరణిద్దాం. కాని బ్రిటిషు వారికి భారత దేశాన్ని పరిపాలించే అవకాశం ఇవ్వబోం అని ప్రకటించారు. ఆయన అభిప్రాయంతో ఏకీబవించే వ్యక్తులు మిన్నకుండగా మౌలానా షేక్‌ ముహమ్మద్‌ మాట్లాడుతూ, ముస్లిం బలహీనతలు, ముస్లింల వద్ద తక్కువగా ఉన్న వనరులు, బ్రిటిష్‌ వారి బలగాలను, ఆయుధాలను ప్రస్తావిస్తూ బ్రితిష్‌ వారితో తలపడటం నష్టదాయకం కాగలదన్న అభిప్రాయాన్నివ్యక్తంచేశారు.

ఆ సందేహానికి సమాధానంగా మౌలానా నానాతవి మాట్లాడుతూ, బదర్‌ యుద్ధంలో పాల్గొన్న ప్రవక్త సహచరుల వద్ద ఆనాడు ఉన్నబలగాలు, వనరులను ఉటంకిస్తూ తక్కువ బలగాలు, అతి తక్కువ ఆయుధాలు, వనరులు ఉన్నా కూడ ప్రవక్త సాధించిన విజయాన్ని సమావేశంలో వివరించారు. ఆ వివరణతో సమావేశంలో అంతవరకు ఇతమిద్ధగా ఏదీ నిరయించుకోలేక పోతున్న మౌలానా ఇమ్‌దాదుల్లా ముహాజిర్‌ మక్కి లాంటి వాళ్ళు వెంటనే పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. మౌలానా షేక్‌ ముహమ్మద్‌ మాత్రం బ్రిటిష్‌ వారితో యుద్ధం ప్రమాదకరం అని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించి మిన్నకుండిపోయారు.

ఈ సమావేశంలో మౌలానా ఖాసిం నానాతవి ప్రధాన సైన్యాధికారిగా ఆంగ్లేయుల మీద పోరాటం జరగాలని నిర్ణయమైంది. ఈ యుద్ధం రెండు స్థావరాల

91