పుట:1857 ముస్లింలు.pdf/90

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మౌల్వీలు

కల్పించిన ప్రత్యేక సదుపాయాలను హరించివేయడం ఆరంభించారు. ఈ చర్య లు ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహించగా మజ్నూషా ఫకీర్‌ లాంటిధార్మికవేత్తలు ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఈ తిరుగుబాటులో శ్రీ భవాని పాథక్‌ నాయకత్వంలోని సన్యాసులు కూడ కలసి రావటంతో ఇది ఫకీర్లు -సన్యాసుల ఉద్యమం గా ఖ్యాతిగాంచింది. ఈ తిరుగుబాటు 1800 వరకు సాగింది.

ఫకీర్లు-సన్యాసుల ఉద్యమం ఉత్తర భారతంలో ఇలా సాగుతుండగా దక్షిణ భారతదేశంలోబ్రిటిషర్ల రాజ్యవిస్తరణ కాంక్ష వలన రానున్నప్రమాదాలను పసిగట్టి తిరుగులేని పోరాటం సాగించిన మెసూరు పులి టిపూ సుల్తాన్‌ యుద్ధరంగంలో శత్రువుతో పోరాడుతూ 1799లో అమరుడయ్యారు. ఆయన తరువాత ఒక వ్యక్తిగా ఆంగేయులను ఎదుర్కొనగల శక్తివంతులు దేశ రాజకీయ చిత్రపటంలో చాలా కాలం వరకు కన్పించలేదు.

1803 ప్రాంతంలో కలకత్తా నుండి బ్రిటిష్‌ సైన్యం ఢిల్లీ నగర ప్రవేశించి ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనను స్థిరపర్చుకుంది. ఆ సమయంలో షా వలీయుల్లా తనయుడు అబ్దుల్‌ అజీజ్‌ దెహల్నీరంగం మీదకు వచ్చారు. మన దేశం బానిసయ్యింది. స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పోరాడి బానిసత్వాన్ని అంతం చేయటం మన విధి అంటూ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ధర్మ పోరాటానికి పిలుపునిస్తూ ఫత్వాను జారీచేశారు. ఆ ప్రకటన ఆ తరువాత ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ముస్లిం ధార్మికవేత్తల నాయకత్వంలో సాగిన పలు పోరాటాలకు భూమికయ్యింది. ఈ విధంగా ప్రజల మీద విసృత ప్రభావం గల ధార్మిక పండితు లు మొదటిసారిగా ఆంగ్లేయుల మీద తిరగబడాల్సిందిగా పిలుపునిచ్చారు.

ఆ పిలుపుతో మరింత ప్రేరణ పొందిన ముస్లిం యోదులు, ఫకీర్లు-సన్యాసుల ఉద్యమం సమాప్తమైన రండు దాశాబ్దాల కాలంలోనే బ్రిటిష్‌ పాలకులను ఎదిరించేందుకు మళ్ళీ సిద్ధమయ్యారు. ఈసారి ఆ పోరుకు సయ్యద్‌ అహమ్మద్‌ బరేల్వి మార్గదర్శకత్వం వహించారు. ఉత్తర పదశ్‌ రాష్ట్రం రాయ్‌బరేలీకి చెందిన సయ్యద్‌ అహ్మద్‌ బరేల్వీ(1786-1831) ఆరంభించిన తిరుగుబాటు ఆ తరువాతి కాలంలో వహాబీ ఉద్యమం గా ఖ్యాతిగాంచింది. ఉత్తర భారతదేశంలో మాత్రమే కాకుండా వాయువ్య సరిహద్దు ప్రాంతాలలో, దక్షిణాదినా పలు ప్రాంతాలకు కూడా విస్తరించి ఉద్యమానికి కార్యకర్తలు ఏర్పడటంతో వహాబీ ఉద్యమం ఇటు ఇస్లాంలో స్వచ్చతను కాపాడేందుకు, మార్గ భ్రష్టత్వం చెందిన ముస్లింలకు సన్మార్గం చూపే ప్రయత్నంతోపాటుగా అటు బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలలో సాహసోపేత చరిత్రను సృష్టించింది.

87