పుట:1857 ముస్లింలు.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
1857
ముస్లింలు

స్వచ్చమైన ధార్మిక మార్గంతో పయనింపచడం ప్రదాన లక్ష్యంగా మొఎల్వీలు (ఇస్లామియాధార్మిక పండితులు) రంగ ప్రవేశం చేశారు.

1857కు పూర్వం

పూర్వ వైభవ ప్రాభవాలను కొల్పోతున్నమొగల్‌ సామ్రాజ్యం 1707లోఔరంగజేబు మరణానంతరం మరింతగా బలహీనపడు తున్న సందర్బంగా ప్రముఖ ధార్మిక వేత్త షా వలీయుల్లా (1703-1762) రంగ ప్రవేశం చేశారు. ప్రభువుల నుండి ప్రజల వరకు దిగజారిపోతున్న ఆధ్యాత్మిక-నైతిక విలువల 'పునరుద్ధరణ' కు ఆయన నడుం కట్టారు. 1731లో మక్కాకు వెళ్ళివచ్చాక తన కార్యాచరణను నిర్దేశించుకుని ప్రజలను- పాలకులను సన్మార్గం దిశగా పయ నింపచేందుకు ఆధ్యాత్మిక బోధనలను ఆరంభించారు. మానవ విలువలను ఉన్నతీకరించేందుకు ప్రత్యేక పద్ధతులలో ప్రచారం చేపట్టారు. ఈనాటికి కూడ ఎంతో ప్రగతిశీలంగా భావించదగిన ఆ బోధనలను హుజ్జతుల్లాహిల్‌ బాలిఘాహ్‌ (Hujjatullahil Baligha) గ్రంథంలో షా వలీయుల్లా పొందుపర్చారు.

ఈ గ్రంథంలో సంపదకు మూలం శ్రమ. సమాజ ఔన్యత్యం కోసం ఎవరైతే శారీరకంగా, మానసికంగా పాటుపడతారో వారు మాత్రమేసంపదను కలిగి ఉండడానికి,అనుభవించడానికి అర్హులు. ప్రజలంతా సమానులు. పాలకులు స్వేచ్ఛ-న్యాయ వ్యవహారాలలో సాధారణ పౌరుని కంటె ఎటువంటి ప్రత్యేకత కలిగి ఉండరు. ఆస్తిని సపాదించుకొనే హక్కు, స్వేచ్ఛ-భద్రతలను పొందు హక్కులను జాతి, మతం, రంగు వివక్షతలు లేకుండా ప్రజలంతా సమానంగా కలిగి ఉండాలి అని ప్రవచించారు. ఈప్రవచనాలు ప్రజలను బాగా ఆకర్షించాయి. ఆ కారణంగా సామాన్య ప్రజల నుండి ప్రముఖుల వరకు ఆయనకు శిష్యగణం ఏర్పడింది. (Untold history of Freedom Struggle, M.Burhanuddin Qasmi, Milli Gazette,16-31 May, 2007, P.4).

ప్రముఖ ధార్మికవేత్త షా వలీయుల్లా తాత్విక బోధనల ప్రచారం ఇలా సాగు తుండగా బెంగాలుకు చెందిన ఇస్లామియా ధార్మిక వేత్త మజ్నూషా ఫకీర్‌ 1763లో ఆంగ్లేయుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు పతాకాన్ని ఎగురవేశారు. ఆంగ్లేయులు సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగ చేస్తూ ప్రజల ధార్మిక విషయాల్లో జోక్యం చేసుకుంటూ, హిందూ-ముస్లిం ధార్మిక సంస్థలకు మొగల్‌ ప్రబువులు


86