పుట:1857 ముస్లింలు.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

సయ్యద్‌ అహ్మద్‌ బరేల్వీ 1818 నుండి 1821 వరకు దేశ పర్య టన గావించారు. 1824లో వాయువ్యసరిహద్ధు ప్రాంతంలోని గిరిజన జాతులతో స్నేహం కలిపి స్వేచ్ఛా-స్వాతంత్య్రాల కోసం ఆంగ్లేయులు, వారి తొత్తుల మీద పోరాటం ఆరంభించారు. ఈప్రయ త్నాలకు పరాకాష్టగా 1827 జనవరి 10న తాత్కాలిక ప్రబుత్వాన్నిఏర్పాటు చేశారు.ఈ విధంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల ఆధిపత్యాన్ని నిరాకరిస్తూ వ్యవస్థాగతరూపంలో బ్బ్రిటిష్‌ వ్యతిరేక స్వతంత్ర ప్రబుత్వం ఏర్పాటు చేయడం భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ప్రథమమని చెప్పవచ్చు.

ఆ క్రమంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా ఆంగ్లేయుల అడుగులకు మడుగులొత్తుతూ వారి మద్దతుతో పాలన చేస్తూ ముస్లింలను ఇక్కట్ల పాల్జేస్తున్న పంజాబ్‌పాలకుడు రాజా రంజిత్‌ సింగ్ కు వ్యతిరేకంగా సయ్యద్‌ అహ్మద్‌ బరేల్వి ఆయుధంచేపట్టారు. 1831 మే 6న బాల్‌కోట్ వద్ద రాజా రంజిత్‌ సింగ్ సైన్యాలతో ఆయన భీకర పోరాటం సాగించారు.

ఈ పోరాటంలో సయ్యద్‌ అహ్మద్‌ బరేల్వీతోపాటుగా ఆయన ప్రదాన సహచరులు షా ఇస్మాయిల్‌ షహీద్‌, ఆయన సహచరులు మరో మూడు వందల మంది అమరత్వంపొందారు. ఈ పరాజయం తరువాత కూడా వహాబీలుగా ఖ్యాతిగాంచిన సయ్యద్‌ అహ్మద్‌బరేల్వి అనుచరులు వాయువ్యసరిహద్దు ప్రాంతాలు, బీహార్‌లోని పాట్నా ప్రధానస్థావరాలుగా చేసుకుని బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం కొనసాగించి స్వాతంత్య్రోద్యమ చరిత్రలో తమకంటూ ప్రత్యేక అధ్యాయాలను సృష్టించుకున్నారు.

ఈ పోరాటాలు ఇలా సాగుతుండగా ఫరీద్‌పూర్‌కు చెందిన పీర్‌ షరియతుల్లా (1781-1840) నేతృత్వంలో 1804లో మరో పోరాటం ప్రారంభమైంది. ఇస్లాం ప్రకారంగా తప్పకుండా అనుసరించాల్సిన ఆచార సంప్రదాయల అనుసరణ మీద, అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న స్వజనం తీరుతెన్నుల మీద షరియతుల్లా తొలిదశలో దృష్టి సారించారు. ఆ తరువాత ఈస్ట్‌ ఇండియా కంపెనీకి తొత్తులైన జమీందార్లు, వడ్డీ వ్యాపారులు, తేయాకు తోటల యజమానులు ఆ ప్రాంతం రైతుల మీద, సామాన్యజనం మీద సాగిస్తున్న పీడనకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు ప్రారంభమైంది. బ్రిటిషర్ల మీద పోరాటం ప్రతి ముస్లింకు ఫర్జ్‌ గా (తప్పనిసరియైునది) షరియతుల్లా ప్రకటించారు. ఆ కారణంగా ఉద్యమకారుల అస్త్రశస్త్రాలు బ్రిటిష్‌ వలస

88