పుట:1857 ముస్లింలు.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గౌరవంతో, ధర్మబద్ధంగా ప్రశాంత జీవితం సాగించాలంటే స్వదేశీయుల పాలన కోసం శత్రువులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టండి. స్వదేశీ సైన్యంలో భర్తీ కండి... మాతృభూమి విముక్తి కోసం సాగుతున్న పోరాటంలో భాగస్వాములు కండిి. శతృవుకు సహకరించకండి. ఆశ్రయం ఇవ్వకండి.

అనంతరం పదమూడు సంవత్సరాల తన బిడ్డడు బిర్జిస్‌ ఖదీర్‌ను నవాబుగా ప్రకటించి అతని సంరక్షకురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. స్వదేశీ పాలకులను, ప్రముఖులను, స్వదేశీ సైనిక ప్రముఖులను, ప్రజలను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఐక్యపర్చారు. పరిపాలనలో హిందూ-

ముస్లింలకు సమాన స్థాయి కల్పించారు. బ్రిటీష్‌ సైనికదళాల పడగ నీడలో కూడా ఎంతో సాహసంతో 14 మాసాల పాటు బ్రిటీష్‌ వలస పాలకుల ఎత్తులను చిత్తు చేస్తూ, ఆంగ్ల సేనలతో పోరాటం సాగిస్తూ, స్వపరిపాలనను సమర్ధవం తంగా సాగించారు.

స్వదేశంలో పరిపాలన కాస్త కుదుట పడ్డాక ఆమె తన భర్త వాజిద్‌ అలీషాను ఆంగ్లేయుల చెర నుండి విడిపించేందుకు కూడా సాహసోపేత మైన పథక రచన చేశారు. ఆంగ్లేయాధికారి Lord Canning అంగరక్షకుల సహకారంతో కలకత్తాలోని విలియం కోట (Fort William) లోని ఆయుధాగారాన్ని పేల్చివేసి కోటలో బందీగానున్న నవాబును విడిపించాలని ఆమె తలచారు. ఈ విషయాన్ని పసికట్టిన ఆంగ్లేయాధికారి Lord Palmerstan ఆ సమాచారాన్ని Lord Canning చెవిన వేయటంతో ఆమె రూపొం దించిన పథకం కాస్తా విఫలమైంది. (Lucknow 1857, Roshan Taqui, New Royal Book Co, Lucknow, 2001 Page. 21)

ప్రథమ స్వాతంత్య్ర సమరానికి ప్రధాన కేంద్రంగా భాసించిన ఢిల్లీ నగరాన్ని