పుట:1857 ముస్లింలు.pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ముస్లింలు

ఆనాడు నిజాం సంస్థానంలోని పలు ప్రాంతాలలోని సైనికులు, ప్రజలు విజృంభించారు.పలువురు ప్రాణాలు అర్పించారు. రాజ్య బహిష్కరణకు గురయ్యారు. అసంఖ్యాకంగా జైళ్ళపాలయ్యారు.

కడప గడపలో ధ్వజమెత్తిన షేక్‌పీర్‌షా

ఈ పోరాట ప్రకంపన లు హెదారాబాద్‌కు మాత్రవు పరిమితం కాలేదు; చిన్నగా రాయలసీమకు కూడ పాకాయి. ఆ సమయంలో కడపజిల్లా ఎల్లంపేట నివాసి షేక్‌పీర్‌ సాహెబ్‌ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. 1857 ఆగష్టు 28న కడప కంటోన్మెంటులోని భారతీయ సైనికాధికారులను, సైనికులను తిరగబడమని ప్రోత్సహించారు. పుట్టుకతో అంధుడైన ఆయన పోరుబాటను ఎంచుకోవడమే కాకుండ ముహర్రం పండగ సందర్భంగా తెల్లవారి పాలన తప్పక అంతరిస్తుందని ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. (The Freedom Struggle in Andhra Pradesh (Andhra),Volumes I, Govt. of AP, Hyderabad, 1997, Page.161-163 )

ఈ రకంగా తెలుగు గడ్డ మీద అక్కడక్కడ సాగిన తిరుగుబాట్లకు ముహర్రం పండుగ రోజును నిర్ధేశిత సమయంగా నిర్ణయించటం కాకతాళీయమా ? లేక మొత్తం మీదా ఓ పథకం ప్రకారంగా తిరుగుబాట్లు సాగాయా ? అనే విషయం ఆసక్తిదాయకం.ఎందుకంటే ఇటు కడపలో తిరుగుబాటు యోధులు భారత దేశంలో ముహర్రం పండుగనాడు ఆంగ్లేయుల అధికారం పతనంమైతుందని ప్రకటించగా, గోదావరి జిల్లాలలో కూడ అక్కడి యోధులు ఆంగ్లేయుల అధికారం సరిగ్గా ముహర్రం పండుగ నాడే అంతం అవుతుందని ప్రకటించి ప్రజలను, ఉద్యమకారులను ఉత్తేజితులను చేశారు.

ఈ నిరయానికి అనుగుణంగా స్వదేశీ సైనికులను ఆకట్టుకుని తిరుగుబాటుకు షేక్‌ పీర్‌ సాహెబ్‌ ముమ్మరం గా సన్నహాలు ఆరంభించారు. ఈ పథకం పూర్తిగా అమలు లోకి రాకముందే, ఆయన చర్యలను పసికట్టిన నబ్రిటిష్ సైనికాధికారులు పీర్‌ సాహెబ్‌నుఅరెస్టుచేసి, విచారణ జరిపి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించగా తిరునల్వేలి ఖైదులో ఆయన జీవితం ముగిసింది. (దేశభక్తిని పెంపొందించిన షేక్‌ పీర్‌ షా (ఆగస్టు 28,1857,) డాక్టర్‌ జి.సాంబశివారెడ్డి, గీటురాయి వారపత్రిక, 9-1-2004, పేజి.18)

ఈ ప్రయతాflలలో భాగంగా మహమ్మదీయ న్యాయశాస్త్ర అధికారిగా బాధ్యా తలు నిర్వహిస్తున్న మౌల్వీ సయ్యద్‌ అజీజ్‌ హుస్సేన్‌ ఇంటింటికి తిరిగి తిరుగుబాటుదారుల

63