పుట:1857 ముస్లింలు.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857:ముస్లింలు


కోసం ఆహారపదార్ధాలూ, డబ్బూ సేకరించారు. తుపాకులకు పూసే గ్రీసులో పంది,ఆవు కొవ్వు ఉంటుందాన్న విషయం ప్రచారం చేసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా హిందూ-ముస్లిం సైనికులను రెచ్చగొట్టారు. ఫలితంగా కంపెనీ సైన్యాధికారులు ఆయనను అరెస్టుచేసి, ఆయన కార్యకలాపాలను రాజద్రోహ చర్యలుగా ప్రకటించి, పది సంవత్సరాలజైలు శిక్ష విధించి ఆయనను కూడ తిరునల్వేలి జైలులో నిర్భంధించారు.

జ్వలించిన కృష్ణా-గుంటూరు గోదావరి సీమలు

నిజాం గడ్డ మీద ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రకటించినవారు,నిజాంకు, ఆంగ్లేయులకు సాహసోపేతంగా హెచ్చరికలు జారీ చేసిన యోధులు,ఉత్తరాదిలో జరిగిన తిరుగుబాట్లలో పాల్గొన్నవారు తమ తమ ప్రాంతాలకు తిరిగివచ్చిఅక్కడి సాహసాలను వర్ణిస్తూ కథలు కథలుగా చెప్పడంతో సాహసులైన స్థానికులు ఆంగ్లేయుల మీద తిరగబడలన్న బలమైన కోరిక కలిగి అక్కడక్కడ తిరుగబడ్డారు.1857జూలై మాసంలో మఛిలీపట్నంలో సిపాయీలు పెరేడ్‌ జరుపు మైదానంఎదురుగా ఆకుపచ్చని పతాకాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎగుర వేశారు.ఆంగ్లెయులను నరికి వేయండి అంటూ హిందూస్థానీలో నినాదాలు రాసిన ప్లకార్డు కూడ ఆ జెండా కర్రకుకట్టి ఉంది. ఈ దృశ్యం ఆంగ్లేయాధికారులలో కలవరానికి కారణమైంది. నిందితులను పట్టుకున్న వారికి 500 రూపాయల బహుమానం కూడ ప్రకటించారు.ఆ సాహసానికి ఒడిగట్టిన వారెవరో తెలుసుకోడానికి అధికారులు ఎంతగా ప్రయత్నించినా ఆ దృశ్యాన్ని రూపొందించిన సాహసుల ఆచూకీని ఏ మాత్రం కనిపెట్టలేక పోయారు.(The Freedom Struggle in Andhra Pradesh (Andhra), Volume I (18001905 AD), Govt. of AP, Hyderabad, 1997, P.147)

1857 నంవంబరు 7న కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని ప్రభుత్వ కచేరి మీద దాడి జరిగింది. ఆయుధాలు చేపట్టిన నాలుగు వందల మంది రోహిల్లాలు కచేరి ఆవరణలోకి దూసుకొచ్చారు. ఈ ఆకస్మిక దాడికి కంపెనీ అధికారులు హడలిపోయారు.ఆ సమయంలో కంపెనీ సైనికుల ప్రతిఘటన అంతగా లేకపోవటంతో కోశాగారం లోనినగదును, ఆయుధాగారంలోని ఆయుధాలను స్వంతం చేసుకున్నారు. ఈ సాహసకృత్యంలో హిందూ-ముస్లిం యోధులు పాల్గొన్నారు.

1857 ఆగస్టు21న స్వాతంత్య్ర సమరయాధుడు రహంబేగ్‌ అరెస్టు అయ్యారు.ముహర్రం పండుగ సందర్బంగా రహంబేగ్‌ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఆ రహస్యం

64