పుట:1857 ముస్లింలు.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857:ముస్లింలు


బలైన అలనాటి యోధుల వారసులలో అత్యధికులు అన్నీ కోల్పోయి ఈనాడు జీవిక కోసం రిక్షాలు లాగుతూ, టాక్సీలు నడుపుతున్న ధుర్బర పరిసితులలో కునారిల్లుతుండగా,అలనాటి బ్రిటీష్ తొత్తుల వారసులు తమకు కలసి వచ్చిన అపార ధనసంపదల ఆసరాతో ఈనాడు రాజకీయ రంగాన్ని ఏలుతూ మంత్రులు, ముఖ్య మంత్రులు, గవర్నర్‌లుగా అందలాలెక్కి ఉన్నత పదవులను వెలగబెడుతుండటం చారిత్రక మహావిషాదం.

తెలుగుబిడ్డల తిరుగుబాటు

ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులపై తిరుగుబాటు చేసిన వారిలో తెలుగు గడ్డకు చెందిన ముద్దుబిడ్డలు ఎందరో ఉండటం తెలుగువారు గర్వించదగిన అంశం. కంపెనీ పాలకులకు వ్యతిరేకంగా పోరుబాట నడవటమే కాకుండ ఆంగేయులతో స్నేహం చేస్తున్న నిజాం నవాబును ఆ దారి మళ్ళించాలని ప్రజలు, ప్రముఖులు ఆది నుండి విఫల ప్రయత్నాలు చేశారు.

ఈ ప్రయత్నాలలో భాగంగా 1857కు ముందు నుండే ఆంగ్లేయాధికారులకు వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని విన్పించారు. చాలా చోట్ల తిరగబడి శిక్షలు అనుభవించారు.ఈ రకంగా తిరుగుబాటు తత్వాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన యోధులు చివరకు 1857లో బహిరంగంగా తిరుగుబాటు జెండను ఉన్నతంగా రెపరెపలాడించారు.

ఈ తిరుగుబాటులో భాగంగా 1857లో బ్రిటీష్ రెసిడెన్సీ మీద జరిగిన సాహసోపేత దాడికి పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ నాయకత్వం వహించారు. ఆయన తన అనుచర లతో కలసి ఆంగ్ల సైన్యాలతో తలబడ్డారు . చివరకు తప్పించుకుపోయిన ఆయనను పట్టిచ్చినవారికి 5 వేల రూపాయలు నజరానా కూడ ప్రకంచిన ప్రభుత్వం ఆయనను బంధించి ఉరితీసింది. ఆయన భౌతికకాయాన్ని ప్రస్తుతం హైదారాబాదులోని సుల్తాన్‌ బజారు పోలీస్‌ స్టేషన్‌ సెంటర్‌లో బహిరంగంగా వ్రేలాడదీసి ఆయన మీద తమలో రగిలిన కసినీ కంపెనీ పాలకులు పైశాచికత్వాన్నీ చాటుకున్నారు.

ఆ బాటలో నడిచి, తుర్రేబాజ్‌ ఖాన్‌కు అండదండలు అందించిన మౌల్వీ అల్లావుద్దీన్‌ను అరెస్టు చేసి ద్వీపాంతరవాస శిక్ష్ష విధించి అండమాన్‌కు పంపగా ఆయన అక్కడే కన్నుమూశారు. ఆ క్రమంలో సయ్యద్‌ అహ్మద్‌ 1857 జులై 17న పోరుసల్పుతూ ప్రాణాలు విడిచారు. బోయనపల్లిలో బ్రిటీష్ సైనికాధికారి కల్నల్‌ డేవిడ్‌సన్‌ను చంపేప్రయత్నంలో జహాంగీర్‌ ఖాన్‌ అను మరో యోధుడు కాల్చివేయబడ్డరు. ఈ విధంగా

62