పుట:1857 ముస్లింలు.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు


కొమ్మలు కూడ కన్పించనంతగా కళేబరాలు వారాల తరబడి పలు గ్రామాలలోని చెట్లకు వేలాడయని ఆంగ్లేయ చరిత్రకారులు తమ గ్రంథాలలో నమోదు చేసిన వివరాలను బట్టి తెలుస్తుంది.

ఈస్ట్‌ ఇండియా కంపెనీ తన ఆంగ్లేయ సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ముస్లింల ఊతకోచకు పురికొల్పింది. ఈ మేరకు లభించిన హద్దుల్లేని స్వేచ్ఛతో తిరుగుబాటు జరిగిన ప్రతి ప్రాంతాన్నీ కంపెనీ సైనికులు శ్మశానవాటికగా మార్చారు. ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. వర్ణించలేనంతగా విధ్వంసం చేశారు. ఈ చర్య లను కంపెనీలోని సైకాధికారులు కొందరు స్వయంగా ఖండించారంటే ఆ విశృంఖల ఊచకోత-విద్వంశాన్ని ఏ స్థాయిలో జరిగిందో ఊహించవచ్చు. ఆంగ్లేయ సెనికుల చేతుల్లో హతమైన స్రీ- పురుషుల వివరాలు పూర్తిగా లభించడం లేదు . ఆనాడు బ్రిటీషర్ల చేత అనుమానించబడి అరెస్టులకు గురయ్యి ఆ తరువాత అదాృశ్యమైపోయిన వారి సంఖ్య మరో 30 వేల వరకు ఉంటుందని అంచనా. (Muslims in India, S.Abul Hasan Ali Nadvi, Islamic Research and Publications, Lucknow, 1980; Muslims In First War of Independece Radiance Views Weekly, 31 August.- 6 September, 2003)

ప్రవాసశిక్షలలో ప్రథాములు

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్‌ వ్యతిరేకతను తీవ్రస్థాయిలో వ్యక్తం చేసిన యోధుల బెడదను ఆంగ్లేయు లు శాశ్వగా వదిలించుకోదలిచారు. భవిష్యత్తులో ఇటువింటి శక్తుల వల్ల ఎటువంటి ప్రమాదం జరక్కుండా చూడాలనుకున్నారు. అందువల్ల ఏమాత్రం వ్యతిరేకత కన్పించినా అటువంటి తిరుగుబాటు యోధులందరి మీద పలుఆరోపణలు చేసి విచారణ 'తంతు' జరిపి చివరకు ప్రవాస శిక్షలు విధించారు. ఆయోధులను తమ ప్రాంతాల నుండి, తమ కుటుంబీకుల నుండి దూరంగా ఉంచేందుకుగాను అండమాన్‌ దీవులకు పంపి వేశారు. ఈ మేరకు పలువురు సంస్థానాధీశులు, వారిసహచరులు, అనుచరులు మాతృభూమి విముక్తి ప్రదాన ధ్యేయంగా గల సామాన్య ప్రజలుకూడ పెద్దసంఖ్యలో ప్రవాస క్షలకు బలయ్యారు. ఈ విధంగా పంప బడిన వారెవ్వరూ తిరిగి తమ కుటుంబీకులను చూడలేక పోయారు. దశాబ్దాల తరబడి ఆ దీవుల్లో ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన చెరశాలల్లో మగ్గుతూ, చిత్ర హింసలు అనుభవిస్తూ కన్నుమూశారు. ఈ విధంగా ప్రవాసశిక్ష కోసం

.........................58.....................