పుట:1857 ముస్లింలు.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముస్లింలు


ఖ్యాతి గాంచిన ఆంగ్లేయాధికారి హడ్సన్‌ ఆయనను హత్యగావించాడు. ఈ విధంగా భారత స్వాతంత్య్ర సంగ్రా మ చరిత్రలో ప్రజల పక్షం వహంచి పత్రికా స్వేచ్చకౖ పోరాడుతూ,అధికారుల చిత్రహింసలను భరిస్తూ చివరకు ప్రాణాలర్పించిన తొలి సంపాదకునిగా ముహమ్మద్‌ బాకర్‌ ఖ్యాతిగాంచారు.

ఆనాటి పత్రికలన్నీ విదేశీ పాలక శక్తుల మీద తమ అక్షర కవాతు చేయటంతో భీతిల్లిన ఆంగ్ల పాలకులు పత్రికలను నిషేధించి, సంపాదకులనూ, ప్రచురణ కర్తలనేకాక పాఠకులను కూడ తీవ్ర నిర్బంధాలకు గురి చేశారు. ఆ కారణంగానే 1853 నాటికి 35గా ఉన్న ఉర్దూ పత్రికల సంఖ్య కాస్తా 1858 నాటికి 12కు పడిపోయిందంటే బ్రిటిటీష్‌ పాలకులు ఎంత క్రూర నిర్బంధాన్ని విధించారో తేలిగ్గానే ఊహించవచ్చు.

చక్రవర్తికి ఇచ్చిన వాగ్దానాన్ని తప్పి1857 సెప్టెంబరు 22న ఢిల్లీ లోని ఢిల్లీ గేటు సమీపాన నిరాయుధులైన మొగల్‌ రాకుమారులను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపుతున్న కెప్టెన్‌ హడ్సన్‌.

ఉధృతంగా సాగిన ఊచకోత

ప్రదమ స్వాతంత్య్ర సమరాన్ని ప్రారంభించినవారూ, అందులో పాల్గొన్నవారు,దాన్ని ప్రోత్సహించిన వారూ ప్రదానంగా ముస్లిం లేనన్న నిర్ణయానికొచ్చిన బ్రిటిష్‌ పాలకులు 27 వేల మంది ముస్లింలను వివిధ ప్రాంతాలలో ఉరితీశారని చరిత్ర రికార్డులు స్పష్ట పరుస్తున్నాయి. ఈ సంఖ్య అధికారిక లెక్క ల ప్రకారంగా వెల్లడంచింది కాగా ఆనాడు కనబడిన చెట్టునల్లా ఉరికంబంగా మార్చి వేలాది సమరయాధులను ఆ చెట్లకు ఉరితీశారు.

57