పుట:1857 ముస్లింలు.pdf/55

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
1857 :ముస్లింలు


చూపారు. ఆంగ్లేయులను తరిమివేసి స్వదేశీ పాలనను చేప ి్టన రోహిల్‌ఖండ్‌ అధినేత ఖాన్‌ బహదాూర్‌ ఖాన్‌ తిరుగుబాటు చేయడమే కాకుండ వివిధా మతాలకు చెందిన స్థానిక పెద్దాలను సమీకరించి సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పదకొండు మాసాలపాటు నడిపారు. ఆయన ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరుబాటన నడవాల్సిందిగా ప్రజలకు ప్రజాస్వామ్య పదజాలంలో పిలుపునిస్తూ భారత దేశ ప్రజల్లారా ! (O People of India) అని సంబోధించి చరిత్ర సృష్టించారు.

ఈ ప్రాంతంలో ప్రజల మధ్యా వ్యక్తమైతున్న ఐక్యతను నజరానాలతో భగ్నం చేయాలని ఆంగ్లేయులు డబ్బుల సంచులు కుమ్మరించినా, మా మతాలు వేరైనా మా మాతృభూమి ఒక్కటే, మా మార్గం ఒక్కటే, మా లక్ష్యం ఒక్కటేనని భావించిన రొహిల్లా ప్రజలు డబ్బు సంచులను తిరస్కరించి, మతం పేరిట మనుషుల్ని చీల్చి పబ్బం గడుపు కోవాలనుకున్న బ్రిీష్‌ పాలకుల ఎత్తులను త్రిప్పికొట్టారు. ప్రజలలో విభేదాలు సృష్టిం చేందుకు దిగుమతి చేసన డబ్బుసంచులను గత్యంతరం లేక తమ ఖజానాకు ఆంగ్లేయాధికారులు తిప్పి పంపారు. ఈ విషయాన్ని T. R Metcalf తన The Aftermath of Revolt గ్రంథాంలో ' Sir James Outram (1803-63) failed to raise Hindus in Rohilkhand against the regime of Khan Bahadur Khan, and had to return money granted for the purpose unspent to the treasury'అనిపేర్కొనాflడు.

ఈ రకంగా దేశంలోని పలు ప్రాంతాలలో ఆత్మగౌరవం గల స్వదేశీ పాలకులు,ప్రజల, సిపాయీల నుండి పోరాటయోధులు ఉద్బవించి ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామాన్నిరక్తతర్పణతో సుసంపన్నం చేశారు.

ఆయుధాలు చేపట్టిన ప్రముఖులు

ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి కోరుతున్న ప్రజల, స్వదేశీ సైనిక యోధుల తొడ్పాటుతో పలు ప్రాంతా లు స్వేచ్ఛా-స్వాతంత్య్రాలను ప్రకటించుకున్నాయి. ఈ విధంగాప్రజల అండదడలతో అలహాబాద్‌ ప్రాంతాన్ని కంపెనీ పాలకుల చెఱ నుండి ధార్మికవేత్త,ఉపాధ్యాయుడు కూడ అయినమౌల్వీ లియాఖత్‌ అలీ విముక్తం చేశారు.మౌల్వీ గొప్పవ్యూహకర్త మాత్రమే కాకుండ మంచికవి కూడ.

52