పుట:1857 ముస్లింలు.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముస్లింలు


ప్రజలను విముక్తి పోరాటం దిశగా నడిపించేందుకు, తిరుగుబాటు యోధులలో స్పూర్తిని కలుగ సేందుకు 'పైగామ్‌-యే-అమల్‌' (ఆచరణ సందేశం) అను కవితను రాశారు. ఈ కవితలో భారత దేశం ఔనత్యాన్ని ప్రశంసించటం మాత్రమే కాకుండ హిందూ-ముస్లిం-సిక్కుల మధ్యా ఐక్యతను బలంగా ఆకాంక్షించారు. ఈ కవిత ఆనాడు అజీముల్లా ఖాన్‌ సంపాదాకత్వంలో వెలువడిన 'పయామే ఆజాది' అను పత్రికలో ప్రచురించబడింది.

ప్రథమస్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా మొగల్‌ పాదుషా బహదూర్‌ షా జఫర ను తమ చక్రవర్తిగా స్వీకరిస్తూ ప్రత్య కంగా ఆంగేయులతో తలపడి తమ ప్రాంతాలను,1857 సెప్టెంబరు 21న ఢిల్లీలోని హుమా యూన్‌ సమా ధి వద్దా లొంగి పోయినప్రథమస్వాతంత్య్ర సంగ్రామం నాయకుడు, మొగల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ సంస్థా నాలను విముక్తం చేసిన స్వదేశీ పాలకులు, ప్రజా నాయకులు కొందారైతే మరికొందారు స్వదేశీపాలకులకు అన్ని రకాలుగా అండదడలు అందించారు. ఈ విధగా అవధ్‌ మహారాణి బేగం హజరత్‌ మహల్‌ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో ఆమెకు అన్ని విధాల బాసటగా నిలిచి అవధ్‌ తిరుగుబాటులో నవాబ్‌ ముహమ్మద్‌ జాన్‌, మమ్మూ ఖాన్‌ లాిం యోధులు ప్రముఖ పాత్ర వహించారు.

ఈ తరహాలో మురాదాబాద్‌కు చెందిన నవాబ్‌ ఫ్జ ఖాన్‌ వలస పాలకులకు వ్యతిరేకంగా ఆయుధాం చేపట్టారు. ఆయన తన అనుచరులను, ప్రజలను ప్రేరేపించి 53