పుట:1857 ముస్లింలు.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముస్లింలు

ప్రజల మధ్య పటిష్ట సంబంధాలు

ఈ పోరాటం సందార్భంగా రాజరిక వ్యవస్థలో ప్రజాస్వామ్య ధోరణులు వ్యక్తం కావటంతో పాటుగా దేశంలోని ప్రధాన మతాలకు చెందిన ప్రజల మధ్యా పటిష్టమైన స్నేహ సంబంధాలు ప్రదార్శితమయ్యాయి. ఢిల్లీలో హిందాూ-ముస్లింలు తమ తమ మతాచారాలను కూడ దాూరంగా ఉంచి, సోదార మతస్థుల మనోభావాలకు ఏమాత్రంవిఘాతం కల్గించ కుండ మసలుకున్నారు.ఈ విషయమై బహదాూర్‌ షా జఫర్‌, ప్రథామ స్వాతంత్య్ర సంగ్రామ సేనాని ముహమ్మద్‌ భక్తఖాన్‌ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు ముస్లింల పండుగ రోజైన బక్రీద్‌ (ఈద్‌-ఉల్‌-జుహా) సందార్భంగా గోవధాను సహించేది లేదాని ప్రకటించారు. ఈ అవకాశాన్ని ఉపయో గించుకొని హిందాూ-ముస్లిం మధ్యా తగాదాలు పెట్టి చీలికలు తీసుకురావాలని ఆంగేయాధికారులు చేసిన ప్రయ త్నాలను వమ్ము చేస్తూ చక్రవర్తి బహదుర్‌ షా జాగ్రత్తలు తీసుకున్నారు. ఢిల్లీ నగరంలో గోవధకు పాల్పడిన వారికి ఉరిశిక్షలు తప్పవని హెచ్చరికలు చేశారు.ఆంగ్లేయులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న రాజ వైద్యుడు అహసానుల్లా ఖాన్‌ (Ahsanullah Khan) గోవధాను నిషేధించటం మతపరంగా తగదాంటూ చక్రవర్తికి సలహా లిచ్చినా, హిందాూ-ముస్లింల ఐక్యతావశ్యకత దృష్ట్యా రాజవైద్యుని సలహాలను కూడ చక్రవర్తి తొసిపుచ్చారు. ఈ హెచ్చరికలు ఎలా ఉన్నా ప్రజలు మాత్రం ఒకరి మతమనోభావాలను మరొకరు గౌరవిస్తూ ముందాుకు సాగారు. ఆ కారణంగా బక్రీదు పండుగను అవకాశంగా చేసుకుని గోవుల ఖుర్బానీని ప్రోత్సహించి తద్వారా హిందువుల ను రెచ్చగొట్టి హిందూ-ముస్లిం ప్రజల మధ్యా చీలిక తీసుకురావాలని ప్రయత్నించిన ఆంగ్లేయాధికారుల కుయు క్తులు సాగలేదు. ఒక ఢిల్లీలోనే కాదు ఇతర ప్రాంతాలలోని స్వదేశీ పాలకులు కూడ హిందూ-ముస్లింల మధ్యా ఐక్యతను పరిరక్షించుకుంటూ విభిన్న మతస్థుల మధ్యానున్న స్నేహసంబంధాలను ఆంగ్లేయుల కుట్రల నుండి కాపాడేందాుకు తగిన చర్యలు తీసుకున్నారు.చక్రవర్తి మర్యాదకు ఏమాత్రం భంగం కలిగించకుండ ఎప్పడినుండో అనుసరిస్తున్న విధివిధానాలను అనుసరిస్తూ మతసామరస్యాన్ని కాపాడారు. ఆ చర్యలకు అనుగుణంగా ప్రజలు కూడ మసలుకున్నారు. ఈ ఐక్యతను ఉత్తర హిందుస్థానం లోని రోహిల్‌ఖండ్‌ ప్రజలు చాలా స్పష్టంగా 51