పుట:1857 ముస్లింలు.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎర్రకోట కేంద్రంగా ఎదిగిన పోరు

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం విూరట్‌లో సిపాయీల క్రియాశీలక తిరుగు బాటులో ఆరంభమై ఢిల్లీ చేరుకుని చివరి మొగల్‌ పాదుషా బహదూర్‌ షా జఫర్‌ నాయకత్వంలో ఎర్రకోట కేంద్రంగా విజృభించింది. 1857 మే 11 నుండి ఢిల్లీలో ఆరంభమైన ఈ పోరు 1857 సెప్టెంబరు 21 వరకు సాగింది. ఈ పోరాటం ప్రేరణగా దేశంలోని పలు ప్రాంతాలలో తిరుగుబాట్లు ప్రజ్వరిల్లాయి. ఆయా ప్రాంతాలలోని ప్రతి స్వదేశీపాలకుడు మొగల్‌ పాదుషా బహదూర్‌ షా జఫర్‌ను తమ చక్రవర్తిగా పరిగణిస్తూ, తమను తాము ఆ చక్రవర్తి ప్రతినిధులుగా ప్రకటించుకుంటూ, చక్రవర్తి గుర్తింపు కోసం అభ్యర్తిస్తూ తమ ప్రతినిధులను ఢిల్లీకి పంపారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని త్రోసిరాజని తమ సంస్థానాలలో గల ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాలతో స్వదేశీ సైనికులు తలపడ్డారు. ఈ అనూహ్య పరిణామాలకు బహదూర్‌్‌ షా జఫర్‌ తొలుత కొంత ఆశ్చర్య పోయినా ఆ తరువాత చక్రవర్తిగా ఆయన అన్ని బాధ్యతలు స్వీకరించారు. అడ్డు వచ్చిన ప్రతి ఆంగ్లేయాధికారిని తిరుగుబాటు యోధులు అంతం చేశారు. ఆంగ్లేయాధికారులంతా నగరం వదలి పారిపోయారు. ఢిల్లీ నగరం పూర్తిగా తిరుగుబాటు యోధుల స్వాధీనంలోకి వచ్చింది. తిరుగుబాటు యోధుల సమ్మతితో మొగల్‌ రాకుమారులను సైన్యాధికారులుగా నియమిస్తూ బహదూర్‌ షా జఫర్‌ రాజ్యకార్యభారాన్ని చేపట్టారు. ఆ తక్షణమే ఆంగ్లేయుల విూద పోరాటానికి కదలి రావాల్సిందిగా ప్రజలను కోరుతూ ప్రకటన విడుదల చేశారు. పరాయి పాలకులను పాలద్రోలడానికి ఢిల్లీకి తరలిరావాల్సిందిగా ఇతర ప్రాంతాలలో గల స్వదేశీ పాలకులకు, స్వదేశీ సైనికులకు ఆయన లేఖలు రాశారు. ఆ లేఖలలో, ఏవిధంగానైనా ఆంగ్లేయులను ఇండియా నుండి తరిమి వేయా లన్నది నా ఎకైక ఆకాంక్ష. నేను స్వేచ్ఛా-స్వాతంత్య్రాలు గల ఇండియాను చూడాలను కుంటున్నాను. శత్రువును తరిమివేసి నేను రాజ్యమేలాలన్నది నా అభిమతం కాదు. రాజులైన విూరు ఖడ్గచాలనం ద్వారా శత్రువును తరిమేసి సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టయితే సార్వభౌమాధికారాన్ని విూకు అప్పగించి నేను బాధ్యతలను నుండి విముక్తం కాదలచుకున్నాను, అని ఆయన తన అభిమతాన్ని స్పష్టం చేశారు.</poem>