పుట:1857 ముస్లింలు.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

( To Drive away the Firangis from India by any means and at any
cost is my only desire. I want to see the whole of India free and independent. Certainly it is not my desire to rule the country for myself by driving
away the enemy. If you, rajas, draw your swords to drive away the enemy
and then from a confederacy and government. I would gladly entrust the
sovereignty to you and will thus be freed from responsibility - Bahdur
Shah II, Mahdi Husain P. IXVII)

తొలిదశలో విూరట్‌ నుండి విచ్చేసిన యోధులు ఆంగ్లేయుల ఆధిపత్యానికి గండికొట్టడంలో ప్రధాన పాత్ర వహించారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలన ఢిల్లీలో అంతం అయ్యాక ఇతర ప్రాంతాల నుండి ఆంగ్లేయులను తరిమికొట్టాలని సంకల్పించిన యోధులు, ఆయా ప్రాంతాలలో తమ ఆధిపత్యం నిలుపుకుని కంపెనీ ప్రభుత్వం స్థానంలో స్వదేశీ రాజుల పాలనకు పునాదులు వేసి పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరుకున్నారు.
ఈ మేరకు ఢిల్లీ చేరుకుని ఎర్రకోట కేంద్రంగా మొగల్‌ దర్బారులో ప్రముఖ పాత్రవహించి చరిత్ర సృష్టించిన వారిలో ముహమ్మద్‌ భక్త్‌ఖాన్‌ ముఖ్యులు. ఆంగ్లేయ సైన్యంలో అధికారిగా 40 సంవత్సరాల అనుభవం గల ఈ నేత 1857లో బరేలిలో తిరుగుబాటు చేసి, కంపెనీ పాలకులను ఖంగుతినిపించి మొగల్‌ పాదుషా నాయకత్వంలో ఆంగ్లేయులతో పూర్తి స్థాయిలో తలపడేందుకు ఢిల్లీ చేరుకుని చక్రవర్తి ఆశీస్సులతో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ యోధుల సర్యసైన్యాధిపతిగా పదవిని చేపట్టారు.
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ మహాసేనానిగా చరిత్ర సృష్టించిన భక్త్‌ ఖాన్‌ స్వతంత్ర ఢిల్లీ పాలనకు మహా పరిపాలనా మండలి ఏర్పాటు చేయటంలో మొగల్‌ చక్రవర్తికి తోడ్పడ్డారు. ఈ మండలి ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించేందుకు 12 ప్రధాన మార్గదర్శక సూత్రాలతో ఒక రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక సిద్ధాంతం ఆధారంగా తయారుచేశారు. అత్యధికుల అభిప్రాయాన్ని గౌరవించటం, ఆ నిర్ణయాల అనుసారంగా కార్యక్రమాలను సాగించటం ప్రధానమని భావించారు. సమావేశాలకు సభ్యుల కోరం, సభ్యుల హాజరు, ఇతరుల హాజరుపై నిషేధం, సభ్యుల ప్రతిపాదనలు, ఆ ప్రతిపాదనలు ప్రవేశ పెట్టేముందు మరొక సభ్యుని సమర్థ్ధన, ప్రతిపాదిత అంశం పై ప్రతిపాదకుని ప్రసంగం, ఆ తరువాత చర్చ, సభ్యులు ప్రసంగిస్తున్నప్పుడు ఎవ్వరూ ఆటంకపరచరాదన్న నిబంధన లాంటి కీలక అంశాలను ఆ విధాన నిర్ణయ పత్రంలో వివరంగా పేర్కొన్నారు.