పుట:1857 ముస్లింలు.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనసముదాయాలు సాహసోపేత త్యాగాల బాటలో తమ ఆధిక్యతను నిలుపుకుంటూ వచ్చి తాము పుట్టి పెరిన గడ్డ రుణం తీర్చుకుంటూ, అత్యధిక సంఖ్యలో ఉన్న తోటి ముస్లిమేతర సోదరులతో కలసి స్వదేశం, స్వదేశీపాలకుల పట్ల తమలో ఉన్న విశ్వాసం, విధేయతలకు తిరుగులేని ప్రతీకలుగా నిలిచారు.
ఈ పోరాటంలో ముస్లింలు ఇతర జన సముదాయాలతో ఎంతగా మమేక మయ్యారో, ఎంతటి ప్రధాన ప్రాత పోషించారో ఆంగ్లేయాధికారి కలిదీజీగి ఖలిబిఖి చేసిన ప్రస్తావన ప్రబల సాక్షీభూతంగా నిలుస్తుంది. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లింల పాత్రను ప్రస్తావిస్తూ ప్రస్తుత దశలో ఈ తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటు అనడానికి వీలులేదు. అది సిపాయిలతో మొదలయ్యింది గాని త్వరలోనే దాని అసలు స్వభావం బయట పండింది. అది ఇస్లామిక్‌ తిరుగుబాటు అని అన్నాడు.

         ( this rebellion, in its present phase, cannot be called a Sepoy
Mutiny. It did begin with the Sepoys, but soon its true nature was revealed, it was an Islamic revolt. - Muslims in India, S.Abdul Hasan Ali
Nadvi, Islamic Research and Publications, Lucknow, 190, Page. 109)
 బెంగాలు సివిల్‌ సర్వీసులో అధికారిగా పని చేసిన Henry Harrington Thomas కూడా 1858 లో తయారు చేసిన Rebellion in India and Our Future Policy అను ఒక కరపత్రంలో, 1857 తిరుగుబాటుకు పథకరచన చేసిన వారుగాని, ప్రధాన చోదశక్తులు గాని హిందువులు కాదని ఇదివరకు రాశాను. అది మహమ్మదీయుల కుట్ర ఫలితమని చూపడానికి ప్రయత్నిస్తాను. తమంతట తాముగా హిందువులు అటువంటి పని తలపెట్టి ఉండేవాళ్ళు కాదు అని వ్యాఖ్యానించాడు.

( ‘ I have stated that the Hindus were not the contrivers or the
primary movers of the 1857 rebellion, and I now shall attempt to show
that it was the result of a Mohammad conspiracy...left to their resources,
the Hindus never would or could have compassed such an undertaking..’ Muslims in India, S.Abdul Hasan Ali Nadvi, Islamic Research
and Publications, Lucknow, 190, P. 111)