పుట:1857 ముస్లింలు.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుర్మార్గంగా, అవమానకరంగా వ్యవహరించారు. కంపెనీ సైనికాధికారుల చర్యల పట్ల ఆగ్రహించిన సైనికులు మే 10 సాయంత్రం అధికారుల విూద తిరగబడి, ఎదురొచ్చిన అధికారులను అంతం చేసి, ఖైదులో బంధించబడిన తమ సహచరులను విడిపించుకున్నారు.
ఇండియాలో ఆంగ్లేయుల అతిపెద్ద సైనిక స్థావరమైన విూరట్‌ సైనిక స్థావరాన్ని విధ్వంసం చేసి, తగులబెట్టి స్థావరాన్నీ పరిసర ప్రాంతాలనూ తిరుగుబాటు యోధులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ తరువాత 1857 మే 10 రాత్రికి విూరట్‌ నుండి బృందాలు బృందాలుగా బయలుదేరి మే 11 తెల్లవారు ఝామున ఢిల్లీ చేరుకుని యమునా నది విూద ఉన్న పడవల వంతెన విూదుగా నగర ప్రవేశం చేశారు.
ఈ సంగ్రామంలో ముస్లిం జనసముదాయాలు ప్రధాన పాత్ర వహించాయి. విూరట్‌ నుండి బయలు దేరిన స్వదేశీ యోధులు ఢిల్లీ చేరాక ఎర్రకోటలో ప్రవేశిస్తూ దీన్‌...దీన్‌ అంటూ రణనినాదం చేశారని ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో స్వయంగా పాల్గొన్న ఆంగ్ల సైనికాధికారులు వెల్లడిస్తున్న చరిత్రను బట్టి తెలుస్తోంది. ఈ వివరణ వలన ఆనాడు ముస్లిం సిపాయీలు పోరుబాటలో అగ్రభాగాన నిలిచారన్నది స్పష్టమౌతుంది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో చివరివరకు సాగిన పోరాటంలో ముస్లిం