పుట:1857 ముస్లింలు.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఏప్రిల్‌ 8న ఉరిశిక్ష విధించారు. ఈ సంఘటనతో సిపాయీలు మరింతగా రెచ్చిపోయారు. ఈ వాతావరణంలో స్వదేశీ సైనికుల నుండి తిరుగుబాటు ప్రమాదాన్ని ఊహించిన కంపెనీ సైనికాధికారులు బ్యారక్‌పూర్‌ సైనికస్థావరంలోని సిపాయీలను అవమానకర రీతిలో నిరాయుధులను చేశారు.
స్వదేశీ యోధుడు మంగళ పాండేను ఉరితీయడం, తమను నిరాయుధులను చేయడం లాంటి అవమానకర విధానాల వలన సిపాయీలు మరింతగా మండిపడ్దారు. ఆ ఆగ్రహం కంపెనీ ఆధ్వర్యంలోని ఇతర ప్రముఖ సైనిక స్థావరాలకు పాకింది. స్వదేశీ పాలకులకు చేసిన వాగ్దానాలను తప్పి, సామ్రాజ్య విస్తరణ కాంక్షతో స్వదేశీ సంస్థానాలను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్న కంపెనీ పాలకుల చర్యలు, వాటి పర్యవసానాలు, సిపాయీల ఆగ్రహాగ్నికి ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో భారతావనిలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ పతాకం ఎగిరింది

విూరట్‌లో రగిలిన తిరుగుబాటు జ్వాల


1799లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా టిపూ సుల్తాన్‌ సాగించిన మహోజ్జ్వల పోరాట చరిత్ర ముగిశాక, 1857లో మొగల్‌ పాదుషా బహద్దూర్‌ షా జఫర్‌ నాయ కత్వంలో భారతావనిలోని పలు ప్రాంతాలలో సాగిన సమరం భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర పుటలలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం గా ప్రసిద్ధి చెందింది. ఆంగ్లేయుల వివక్షాపూర్వక చర్యలు, మితివిూరిన పెత్తనం, అన్ని రంగాలలో అప్రతిహతంగా సాగుతున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ దోపిడీ మున్నగువాటిని సహించలేని సగటు భారతీయుడు, ఆంగ్లేయుల చర్యలకు కినిసిన ఈస్ట్‌ ఇండియా కంపెనికి చెందిన సిపాయీలు, తమ స్వంత సంస్థానాలలో కేవలం బ్రిటీషర్ల అభీష్టం మేరకు మాత్రమే నడుచుకోవాల్సిన దుస్థితికి గురైన, ఆత్మగౌరవం గల స్వదేశీ పాలకులు ప్రధానంగా ప్రథమ స్వాతంత్య్ర పోరాటానికి బీజాలు వేశారు.
1857 ఏప్రిల్‌ 24న నూతన తూటాల వాడకాన్ని విూరట్‌ సైనిక స్థావరంలోని సిపాయీలు ఖరాఖండిగా నిరాకరించారు. ఈ చర్యతో ఆగ్రహించిన ఆంగ్లేయాధికారులు సిపాయీలను నిర్భంధించి సైనిక విచారణ జరిపి ఖైదులో ఉంచారు. ఈ సందర్భంగా ఖైదులో తూటాల వాడకాన్ని నిరాకరించిన సైనికుల పట్ల ఆంగ్లేయాధి కారులు చాలా