పుట:1857 ముస్లింలు.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విస్మరణకు గురైన త్యాగాలు

యోధుడూ, అద్వితీయ విప్లవాకారుడూ మౌలానా ఒబైదుల్లా సింధీ, తాను కలలుకన్న స్వేచ్ఛా భారతదేశస్వతంత్ర పతాకం రెపరపలు చూడకుండానే, అస్వస్థతకు లోనై 1944 ఆగష్టు 22న కన్నుమూశారు.

ఈ యోధుడి పోరాట చరిత్ర ఇలా ఉండగా, Biman Bihari Majundar తన గ్రంథం Militant Nationalism in India and Its Socio-Religious Background లో, మౌల్వీ ఉబెదుల్లా శిక్కు మతం నుండి ఇస్లాంలోకి మతాంతీకరణ చెందాడు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని షహరాన్‌పూర్‌ లోని దియోబంద్‌ వద్ద కొంతమంది అనుచరులను తీసుకుని ఇండియా మీద ముస్లింల దాడి చేయడానికి కృషిచేశారు అని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

(Moulvi Obidulla, who had been converted to Islam form Sikhism, gathered a band of followers at Deoband in Saharanpur district of UP with the idea of promoting a great Muslim attack on India. He can not be called a nationalist at all - India’s Freedom Movement and Muslims, M.K.A Siddiqui, IOS, New Delhi,1998.)

భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో భాగంగా ఇతర దేశాల సహాయంతో ఆంగ్లేయుల మీద యుద్ధం ప్రకటించాలని ప్రయత్నాలు చేసిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ లాంటి నాయకులున్నారు. ఆ మహాయోధుల విధానాన్నికూడా ఉబైదుల్లా సింధీ అనుసరించిన విధానంతో పోల్చి నేతాజీ కూడ జాతీయవాది అని పిలువబడడానికి అర్హులు కారని చెప్పడానికి ఎవరైనా సాహసించగలరా? Biman Bihari Majundar సూత్రీకరణల వెనుక మాతృభూమి కోసం ఆహర్నిశలు శ్రమించిన ముస్లిం యోధుల పట్ల వ్యతిరేకత ఏస్థాయిలో దాగుందో వెల్లడవుతుంది.

ఈ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో గ్రహించడానికి జాతీయోద్యమం నాటి మరో రెండు సంఘటనలను ఇక్కడ ఉటంకించాలి. మాతృభూమి పట్ల తిరుగులేని గౌవరాభిమానాలకు పెట్టింది పేరైన యోధులలో ప్రముఖ జాతీయోద్యమకారులు మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌, విప్లవ యోధుడు అష్పాఖుల్లా ఖాన్‌లు కూడా ఆరోజుల్లో ముస్లింల పట్ల ఉన్న వ్యతిరేక భావజాలం, వివక్షకు గురయ్యారు.

ఈ విషయాన్ని అబుల్‌ కలాం ఆజాద్‌ తన ఇండియా విన్స్‌ ఫ్రీడం గ్రంథంలో విస్తారంగా తెలిపారు. ఆ రోజుల్లో యువకుడు అబుల్‌ కలాం ఆజాద్‌ బెంగాల్‌కు

279