పుట:1857 ముస్లింలు.pdf/283

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

చెందిన విప్లవగ్రూపు అనుశీలన సమితిలో సభ్యత్వం కోరారు. మౌలానా ముస్లిం కావడం వల్ల ఆయనను అనుమానించి సమితిలో సభ్యత్వం ఇవ్వడానికి సమితి నాయకులు ఇష్టపడలేదు. చివరకు గత్యంతరం లేక మౌలానా స్వయంగా తానే దారుల్‌ ఇర్షాద్‌ అనే విప్లవ సంఘామన్ని స్థాపించారు. మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను త్యాగం చేయ డానికి సిద్దపడ్డ యువకులను దారుల్‌ ఇర్షాద్‌ సభ్యులుగా చేర్చుకుని వారి చేత ఖుర్‌ఆన్‌ మీద ఖిద్దిపూర్‌ స్మశానంలో ప్రమాణాలు చేయించారు. ఆ తరువాత కొంత కాలానికి బెంగాలు విప్లవకారులు తమ తప్పును గ్రహించి మౌలానాను గౌరవించడమే కాకుండా, ఆయన సలహాల మేరకు విప్లవ కార్యకలాపాలను పలు ప్రాంతాలకు విస్తరింపచేశారు.

ఈ విషయాలను మౌøలానా అబుల్‌ కలాం ఆజాద్‌ తన ఇండియా విన్స్‌ ఫ్రీడం గ్రంథంలో ప్రస్తావిస్తూ,' In fact, all the revolutionary groups were then actively anti-Muslim. At first they did not fully trust me and tried to keep me outside their inner council..’ (India Wins Freedom, Moulana Abul Kalam Azad, Orient Longman, Delhi, 1998, P. 5)అని పేర్కొన్నారు.

మాతృదేశం కోసం ప్రాణాలు తృణప్రాయంగా భావించి త్యజించడానికి ముందుకురికిన ముస్లిం విప్లవకారులకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు తప్పలేదు. ఆంగ్లేయుల నుండి విముక్తికోసం సాయుధపోరాటం చేసి చివరకు అత్యంత ధైర్యసాహసాలతో ఉరికంబం ఎక్కిన విప్లవకారుడు అష్పాఖుల్లా ఖాన్‌కు కూడా మౌలానా అబ్దుల్‌ కలాంకు ఎదురైన చేదు అనుభవం కలిగింది.

చిన్న వయస్సులోనే విప్లవోద్యమం పట్ల ఆకర్షితుడైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌కు చెందిన అష్పాఖుల్లా ఖాన్‌ అనాడు రాంప్రసాద్‌ బిస్మిల్‌ నాయకత్వంలోని విప్లవదళంలో చేరాలనుకున్నాడు. ఆ దిశగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ముస్లిం కనుక విపవదళంలో చేర్చుకునేందుకు తొలుత బిస్మిల్‌ అంగీకరించలేదు. ఈ విషయాన్ని బిస్మిల్‌ స్వయంగా తన ఆత్మకథలో ప్రస్తావిస్తూ నాకు బాగా గుర్తు, చక్రవర్తి క్షమాప్రకటన అనంతరం నేను షాజహాన్‌పూర్‌ తిరిగి వచ్చినప్పుడు నీవు మొదట నన్ను స్కూలులో కలిసావు. నన్ను కలుసుకోవాలనే కోర్కె నీ మనస్సులో ఎంతగానో ఉండింది. మైన్‌పురి కుట్ర గురించి నాతో కొంత మాట్లాడలని నీవు కోరావు. స్కూలులో చదివే ఒక ముస్లిం విద్యార్థి నాతో యిలాంటి విషయాల గురించి ప్రస్తావిసున్నాడని శంకించి నేను నీ ప్రశ్నలకు ఎంతో ఉపేక్షతో జవాబు ఇచ్చాను. నీకప్పుడు ఎంతో ఖేదం కలిగింది. నీ హృదయంలోని


280