పుట:1857 ముస్లింలు.pdf/281

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

భారత స్వాతంత్య్రసంగ్రామంలో సిల్క్‌ అక్షరాల కుట్ర గా ఖ్యాతి గాంచిన విప్లవ కార్యక్రమాన్ని రూపొందించటంలో ఒబైఫుల్లా ప్రముఖ పాత్ర వహించారు. ఒక వైపున విప్లవ కార్యకలాపాలలో పాల్గొంటూనే ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు డాక్టర్‌ యం. అన్సారి సహకారంతో కాబూల్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌ శాఖను ప్రారంభించారు. ఈ విషయామన్ని అన్సారి ప్రస్తావిస్తూ this was the first branch of the Congress outside the boundaries of the British empire, and I am proud to say that I was its first president అని సంతోషం వ్యక్తం చేశారు.

మౌల్వీ ఒబైదుల్లాను ప్రమాదకర వ్యక్తిగా పరిగణించిన బ్రిటిష్‌ పాలకులు ఆయనను ఆఫ్గనిస్థాన్‌ నుండి బయటకు పంపేందుకు గానీ, వీలుచిక్కితే అంతం చేయడానికి గానీ ప్రయత్నాలు సాగించారు. ఆ ఒత్తిడి వలన సుమారు 7 సంవత్సరాల తరువాత ఒబైదుల్లా ఆఫ్గనిస్థాన్‌ను విడిచిపెట్టి నిరంతరం నీడలా వెంటాడుతున్న బ్రిటిష్‌ ఏజెంట్ల కన్నుగప్పి 1922 డిసెంబరు లో మాస్కో చేరుకున్నారు . 1926లో కాన్‌స్టంటినోపిల్‌లో ఉన్నప్పుడు తాను నిరంతరం కలలుగంటున్నస్వతంత్ర భారత దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని మౌలానా ఒబైదుల్లా సింధీ తయారు చేశారు.

ఆ రాజ్యాంగానికి The Constitution of the Fedarated Republic of India, 1926 అని పేరుపెట్టారు. ఆయనను కానస్టంటినోపిల్‌లో కలసిన పండిట్ జవహార్‌లాల్‌ నెహ్రూ ఆ రాజ్యాంగ ప్రతిని చూసి ఇది మన దేశం ఎదుర్కొంటున్న కమ్యూనల్‌ ప్రాబ్లంను (మతతత్వ సమస్య) సమర్దవంతంగా పరిష్కరించగలదని అభిప్రాయపడ్డారు. ఆ విషయాన్ని ఆయన తన 'ఆత్మకథ'లో He (Obidullah) had produced a scheme for the United States or United republics of India Which was quite an able attempt to solve the communal problems' అని ఒబెదుల్లో కృషిని కొనియాడారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు Dr. Tarachand తన History of Freedom Movement in India లో ప్రస్తావిస్తూ,"..Obidulla has made the independence of India his life mission.. He sacrified much and risked much for its sake అని అన్నాడు.

చివరకు 1939లో అరవై ఏడు సంవత్సరాల పెద్ద వయస్సులో, 24 సంవత్సరాల ప్రవాస జీవితం తరువాత, ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. అసమాన పోరాట

278