పుట:1857 ముస్లింలు.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విస్మరణకు గురైన త్యాగాలు


మెసూరు గజిట్ లో ఉన్నాయంటూ ఒక్క మాట రాసి డాకర్‌ శాస్త్రి అక్కడితో ఆ విషయాన్ని సరిపెట్టి తప్పించుకోచూశారు.

డాక్టర్‌ శాస్త్రి పేర్కొన్న ప్రకారంగా బి.యన్‌. పాండే మైసూరు గెజిట్ లో ఈ సంఘటన కోసం అన్వేషించారు. ఈ విషయమై మైసూరు చరిత్ర మీద నిష్ణాతులైన ప్రొఫెసర్‌ శ్రీకాంతయ్య, బ్రిజేంద్రానాథ్‌ సీల్‌లను ఆయన సంప్రదించారు. మైసూరు రాజ్య చరిత్ర మీద మంచి పరిజ్ఞానం కలిగిఉన్న ప్రముఖ చరిత్రకారుడు శ్రీకాంతయ్య ఈ విషయమై పాండేకు లేఖ రాస్తూ మైసూరు రాజ్యచరిత్ర అధ్యయనశీలిగా మూడు వేల మంది బ్రాహ్మణుల ఆత్మహత్య సంఘటన తన దృష్టికి రాలేదని, అటువంటి సంఘటన జరగలేదని తాను ఘంటాపథంగా చెప్పగలనని రాశారు.

ప్రొఫెసర్‌ శ్రీకాంతయ్య అంతటితో ఊరుకోలేదు, బి.యన్‌. పాండే ఆసక్తిని బట్టి టిపూను లౌకిక ప్రభు వుగా రుజువు చేయ గల పలు పత్రాలను, ముఖ్యమెన డాక్యుమెంట్ల కాపీలను ఆయనకు పంపారు. ఈ డాక్యుమెంట్లను పరిశీలించి టిపూ మీద దురుద్దేశ్యపూర్వకంగా సాగిన ఆరోపణల మీద డాక్టర్‌ శాస్త్రి పాత్ర గురించి డాక్టర్‌ పాండే ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన నిజానిజాలను తెలుపమంటూ కోరిన మీదట శ్రీకాంతయ్య స్పందనను, తాను సేకరించిన ఇతర పత్రాల వివరాలను డాక్టర్‌ శాస్త్రి దృష్టికి తెస్తూ ఆయన పాఠ్య గ్రంథంలో టిపూ గురించి ఉటంకించిన సంఘటనకు ఆధారాలు చూపాలని మళ్ళీ కోరుతూ డాకర్‌ పాండే ఆయనకు ఉత్తరం రాశారు. ఆ ఉత్తరానికి డాకర్‌ శాస్త్రి స్పందిస్తూ టిపూకు సంబంధించిన విషయాన్ని ఆంగ్లేయ సైనికాధికారి కల్నల్‌ మాల్సన్‌ రాసిన హిస్టరీ ఆఫ్‌ మైసూరు (History of Mysore) గ్రంథం నుండి గ్రహించానని తెలిపారు.

ఆ గ్రంథం ఎక్కడుందో తెలుపమని మళ్ళీ కోరగా అది లండనలోని విక్టోరియా మహారాణి వ్యకిగత గ్రంథాలయం నుండి సంపాదించానని డాకర్‌ శాస్త్రి సరిపెట్టుకున్నారు. డాక్టర్‌ పాండే అంతటితో ఆ విషయాన్ని వదిలిపెట్టలేదు. విక్టోరియా మహారాణి వ్యక్తిగత గ్రంథాలయానికి చెందిన అధికారికి సదరు గ్రంథం తనకు కావాలని రాయగా అటువంటి గ్రంథం గానీ, దాని రాత ప్రతిగానీ తమ గ్రంథాలయంలో లేదని ఆ అధికారి స్పష్టం చేస్తూ డాక్టర్‌ పాండేకు లేఖ పంపారు.

ఆ సమాధానాలన్నిటినీ డాక్టర్‌ పాండే డాక్టర్‌ శాస్త్రికి పంపుతూ ఏ ఆధారంతో టిపూ మీద ఆ ఆరోపణ చేశారో తెలుపమని మళ్ళీ మళ్ళీ కోరుతూ ఎన్ని ఉత్తరాలు

271