పుట:1857 ముస్లింలు.pdf/275

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

రాసినా డాక్టర్‌ శాస్త్రి నుండి ప్రత్యుత్తరం రాకపోవటంతో డాక్టర్‌ శాస్త్రి రాసిన సంఘటన వాస్తవం కాదనీ, అది అభూతకల్పన అనీ బి.యన్‌. పాండే నిర్ణయానికొచ్చారు. డాక్టర్‌ పాండే ఈ విషయం మీద మరింత పరిశోధన జరిపి, టిపూ మీద ఇటువంటి అసత్య ఆరోపణలను డా. హరప్రసాద్‌ శాస్త్రి ఉదేశ్య పూర్వకంగానే రాశారని నిర్ధారించుకున్నారు. అనంతరం ఈ పూర్తి వ్యవహారాన్ని, దీనికి సంబంధించిన పత్రాలను కలకత్తా విశ్వ విద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ డాక్టర్‌ అసుతోష్‌ ముఖర్జీకి పంపారు. టిపూ మీద డాక్టర్‌ శాస్త్రి ఉద్దేశ్యపూర్యకంగా చేసిన అసత్యాలను తగిన రుజువులతో సహా ఆయన దృషికి తీసుకువచ్చారు. ఆ విషయం తెలుసుకున్న విశ్వవిద్యాలయం అధికారులు తమ విశ్వవిద్యాలయం పాఠ్య గ్రంథాల జాబితా నుండి డాక్టర్‌ శాస్త్రి రాసిన పుస్తకాన్ని తొలగించారు. ఈ తొలిగింపు జరిగే సరికే అనేక సంవత్సరాలు గడిచి పోవడంతో మేధోవంచనకు పాల్పడిన డాక్టర్‌ శాస్త్రి, టిపూ మీద వేసిన అభాండాలు, చేసిన అసత్య ఆరోపణలు అక్షరసత్యాలుగా బహుళ ప్రచారం పాందాయి.

ఆ తరువాత కూర్గు, మలబారు హిందూ జనసమూహాల పట్ల టిపూసుల్తాన్‌ చాలా దారుణంగా, అత్యంత క్రూరంగా వ్యవహరించారని, ఈ క్రూరత్వానికి టిపూ మతదురహంకారం కారణమని మరొక ఆరోపణ ప్రచారంలోకి వచ్చింది. ఈ ఆరోపణలలోని నిజానిజాలను కూడా నిగ్గు తేల్చుతూ, టిపూ కూర్గు ప్రజల పట్ల కరినంగా వ్యవహరించింది వాస్తవమే అయినా, ఆ వ్యవహార సరళికి రాజకీయాలు మాత్రమే కారణమని, ఆయన కఠిన వైఖరికి మతం, మత విశ్వాసాలు ఏమాత్రం కారణం కావని శ్రీ బి.యన్‌. పాండే లాంటి పలువురు పరిశోధకులు తేల్చి చెప్పారు.

టిపూ సుల్తాన్‌ ప్రదర్శించిన మత సామరస్య వైఖరి మూలంగా వాస్తవంగా ఆయన పలువురి ప్రశంసలను అందుకున్నారు; ప్రజల మన్నన పొందారు. టిపూ మత సామరస్య వైఖరిని కొనియాడుతూ 1930 జనవరి 23 నాటి యంగ్ ఇండియా (Young India) లో మహాత్మాగాంధీ విదేశీ చరిత్రకారులు ఫతే అలీ టిపూ సుల్తాన్‌ను మత పిచ్చ కలవాడిగా చిత్రించారు. తన రాజ్యంలో గల హిందువులను బలవంత మత మార్పిడికి టిపూ ప్రయత్నించాడని ఆరోపించారు. అతను అలాంటి వ్యక్తికాదు. ఆయన మీద సాగిన పలు అసత్య ఆరోపణలకు భిన్నంగా, హిందూ ప్రజానీకంతో టిపూకు చాలా మంచి సంబంధాలు ఉండేవి అని పేర్కొన్నారు.

272