పుట:1857 ముస్లింలు.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ఆ దుర్భావనల ప్రబావం వలన టిపూ సుల్తానను మతోన్మాదిగా చిత్రీకరించేందుకు కలకత్తా విశ్వవిద్యాలయం సంస్కత విభాగం అధిపతి డాక్టర్‌ హర ప్రసాద్‌ శాస్త్రి లాంటి వారు చేసన దుష్టపన్నాగాలు డాకర్‌ బి.యన్‌. పాండే లాంటి నిష్పాకిక చరిత్రకారుని కృషి వలన బట్టబయలైంది.

బ్రిటిష్‌ రచయిత Charles Stewart ప్రచారం చేసన దుర్భావనల మార్గంలో పయనించిన డాకర్‌ శాస్త్రి టిపూ బలవంత మత మార్పిడికి పాల్పడినందున మతాంతీకరణ యిష్టంలేని మూడు వేలమంది బ్రాహ్మణులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ ఆత్మహత్యల దుస్సంఘటనలకు టిపూ కారణమని తాను రాసిన మెట్రిక్యులేషన్‌ స్థాయి చరిత్ర పాఠ్యపుస్తకంలో పేర్కొన్నారు. (Three thousand Brahmins committed suicide as Tipu wanted to convert them forcibly into the fold of Islam. - Arungazeb and Tipu Sultan, Evalution of Their Religious Polices, Dr.B.N.Pande, IOS, New Delhi, 1996, P. 14)

ఈ పుస్తకం ఆనాడు బెంగాల్‌, అస్సాం, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలోని ఉన్నత పాఠశాల విద్యార్థుల చరిత్ర పాఠ్య గ్రంథంగా చలామణీ అయ్యింది. ఈ విషయం ప్రఖ్యాత చరిత్ర పరిశోధకులు, పార్లమెంటు సబ్యులు, రాజస్థాన్‌ గవర్నర్‌గా పనిచేసిన డా. బి.యన్‌. పాండే దృష్టికి 1928-1929 ప్రాంతంలో వచ్చింది. ఆ సమయంలో ఆయన Religious Policy of Tipu Sultan అనే విషయం మీద పరిశోధన చేస్తున్నారు.టిపూను లౌకిక ప్రభువుగా నిరూపించే పలు దృష్టాంతాలు, ఫర్మానాలు, మఠాలకు, మఠాధికారులకు, జగద్గురు వులకు, పీరాధిపతు లకు రాసిన వందాలాది లేఖలను అధ్యయనం చేసిన ఆయనకు ఈ ఆరోపణ ఆశ్చర్యానికి లోనుచేసింది. స్వమతాలు, మత విశ్వాసాలు, మతస్థుల పట్ల సమాన గౌరవాన్ని ప్రదర్శించినటిపూ మీద వచ్చిన ఆరోపణలను బి.యన్‌. పాండే నమ్మలేక పోయారు.

ఈ విషయం గురించి వాస్తవం తెలుసుకోవాలని ఆయనలో ఉత్సుకత పెరిగింది. ఆ సమాచారానికి ఆధారాలేవో తెలుపమని డా. హరప్రసాద్‌ శాస్త్రి గారికి ఆయన పలు లేఖలు రాసారు. డాక్టర్‌ శాస్త్రి నుండి ఎటువంటి సమాధానం రాలేదు. డాక్టర్‌ పాండే పట్టువదలని విక్రమార్కునిలా ఉత్తరాలు రాసిరాసి అలసిపోయి, చివరకు ఎటువంటి సమాధానం రాకపోయేటప్పటికిే, ఈ చర్యను మేధోపరమైన వంచనగా పరిగణించాల్సి వస్తుందని డాక్టర్‌ శాస్త్రిని హెచ్చరించారు. ఆ హెచ్చరికతో ఈ సంఘటన వివరాలు

270