పుట:1857 ముస్లింలు.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విస్మరణకు గురైన త్యాగాలు


ఆ తరువాత ఉనికిలోకి వచ్చే పాపులర్‌ గ్రంథాలు, ఆ గ్రంథాల ఆధారంగా రూపుదిద్దుకునే కళలు-కళారూపాలు-సాహిత్యం ద్వారా ముస్లిం వ్యతిరేకత సమాజంలోకి ప్రవేశించి చివరకు ఘనీభవించడం వలన ఆ దుష్ప్రభావం మరింత ప్రకోపించి యావత్తు సమాజాన్ని ఎవిధాంగా చుట్టేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు, విద్వేష పూరిత చరిత్ర రచనా క్రమాన్నిప్రశ్నించే దిశగా తగినంత కృషి జరగలేదు. బ్రిటిష్‌ చరిత్రకారులు బీజం వేసి పోషించిన మొలకలు కొందరు స్వదేశీ చరిత్రకారులు, సాహిత్యకారుల నిర్వాకం మూలంగా ప్రజల హృదయాలలో మహా వృక్షాలుగా పెరుగుతున్నా అలనాటి అపోహలను-అపార్ధాలను -అరసత్యాలను- అసత్యాలను పెద్దగా ఖండిచటం కానీ, ప్రజలకు చరిత్రకు సంబంధించిన వాస్తవాలు తెలుపటం గానీ జరగాల్సిన స్థాయిలో జరగలేదు.

ముస్లిం పాలకులను పరదేశీయులుగా చిత్రించటం వలన ముస్లిం ప్రభువులను, బ్రిీటీష్‌ ప్రభుత్వాన్ని కలిపి విమర్శించడం, ముస్లిం పాలకులతో పోరాడిన ప్రతి స్వదేశీ పాలకుడ్ని జాతీయవాదిగా ప్రశంసించడం జాతీయోద్యమకాలంలో ఆనవాయితీగా మారినందున ముస్లిం వ్యతిరేక భావజాల ప్రసరణను అడ్డుకోడానికి ఎక్కువ మంది రచయితలు - చరిత్రకారులు ప్రయత్నించలేచు. ఈ విషయం మీద తగినంతగా దృష్టి సారించలదు, సాహసించలేదు. ఆ కారణంగా ప్రచారంలో ఉన్న అసత్యాల పునాదులను ప్రశ్నించడం జరగలేదు.

చారిత్రక అవాస్తవాలు ప్రశ్నించబడని చోట అసత్యాలు సత్యాలుగా ప్రజల మస్తిష్కాలలో బలంగా తిష్టవేసి కూర్చున్నాయి. కానీ అబద్దాలను సవాల్‌ చేసిన చోట అటువంటి అవాస్తవాలను కావాలని సృష్టించిన వ్యక్తులు తోకముడిచి చెంపలేసుకున్న సందర్భాలున్నాయి.

బ్రిటిష్‌ రచయిత Charles Stewart లాంటి వారు ఏమాత్రం విచక్షణ లేకుండా ముస్లిం పాలకులను ద్వేషిస్తూ పలువిధాలుగా దూషించారు. అసత్యాలను సత్యాలుగా నమ్మించి నమోదుచేశారు. ఆ ప్రయత్నాలలో భాగంగా లౌకిక ప్రభువుగా ఖ్యాతిగాంచిన టిపూ సుల్తాన్‌ను అసహనమూర్తిగా, బలవంతపు మత మార్పిడిలకు పాల్పడిన మత దురహంకారిగా, హిందువులను ఊచకోత కోసిన దుష్టుడిగా చిత్రీకరించబడ్డాడు. ఈ కారణంగా టిపూ గురించి యిప్పిటికీ పలు దుర్భావనలు చోటుచేసుకొని ఉన్నాయి.

269