పుట:1857 ముస్లింలు.pdf/267

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

రాజులతో చేసిన యుద్ధ్దాలు, ముస్లిం రాజులు ముస్లిం రాజులతో చేసిన పోరాటాలు చరిత్రలో కన్పించేవి కావు. ప్రత్యర్థి హిందువైనా, ముస్లింమైనా రాజ్య విస్తరణకాంక్ష కలిగిన ప్రభువుకు సంబంధం లేదు. అతనికి రాజ్యమే ప్రధానం. ఇది ఇలా ఉండగా ముస్లిం ప్రబు వు సెన్యంలో హిందువులు, హిందూ పాలకుని సైన్యంలో ముస్లింలు ఉంటూ ఆ రాజుల పక్షాన తలపడిన సంఘటనలు కోకొల్లలుగా చరిత్రలో కన్పిస్తాయి.

ఈ విషయం చారిత్రక వాస్తవం కాగా, ఆంగ్ల చరిత్రకారులు పాలకుల మతం ఆధారంగా చేసిన చరిత్ర యుగ విభజన ఊబిలో పడిపోయి, మతతత్వదృక్పథంతో చరిత్ర రచన సాగటంతో ప్రభువుల మతాన్నిబట్టిఆ మతం కోసం మాత్రమే వారంతా పోరాఫాలు చేసినట్టుగా, ఆయా మతస్థులు వారి వెంట నడిచినట్టుగా చరిత్రకారులు వాస్తవ దూరమైన విషయాలను గ్రంథస్థం చేశారు.

ఈ మార్గంలో సాగిన చరిత్ర రచన మూలంగా పాలకుల మతం పాలితుల మతం ఒక్కటే అయినట్టయితే ప్రభువులను-పాలితులను ఒక్క గాటన కట్టి చూడటం జరిగింది. ఇది మతతత్వ చరిత్ర రచనా దృక్పథం వలన జరిగింది...దీని ప్రభావంతో మధ్య యుగంలోని అరబ్బు, టర్కు, ఆఫ్ఘన్‌, మొఘల్‌ జాతుల పాలకులను వారు అనుసరించే మహమ్మదీయ మతాన్ని బట్టీవారిని 'ముస్లింరాజులు' అనీ, వారి దండ యాత్రలను ముస్లిం దండయాత్రలు అనీ, వారి రాజ్యాలను ముస్లిం రాజ్యాలు అనీ, వారి పరిపాలనను ముస్లిం పరిపాలన అనీ, మతతత్వదృక్పథం మరింత మితిమీరి/ ఘనీభవించి ఇస్లాం రాజ్యాలు అని పాఠ్యపుస్తకాలలో రాయడం జరిగింది. (చరిత్ర పాఠ్యపుస్తకాలలో మతతత్వం నీడలు, డాక్టర్‌ జి.సాంబశివారెడ్డి, గీటురాయి వారపత్రిక, పేజి.2, 28-7-2006, హైదారాబాద్‌ ).

ఆ క్రమంలో ముస్లిం పాలకులను పాలితులలోని జనమూహంలోని ముస్లింలను ఒకేగాట కట్టారు. ముస్లిం పాలకుల మంచి చెడలను పాలితులలోని ముస్లింలకు కూడా అంటగట్టారు. ప్రభువులు హిందువైనా ముస్లిమైనా పాలనాపరంగా ప్రభువులంతా రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికి ఒకేరకంగా వ్యవహరిస్తారన్నవాస్తవకోణాన్ని విస్మరించారు. ఈ విస్మరణ ఫలితంగా ముస్లింపాలకుల పాపాల భారాన్ని పాలిత ముస్లింలు మోయాల్సిన అగత్యం ఏర్పడింది.

ఈ సందర్బంగా చరిత్ర పాఠ్య గ్రంథాలలో ముస్లిం ప్రబువుల గురించి, ఆ ప్రబువుల

264