పుట:1857 ముస్లింలు.pdf/266

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విస్మరణకు గురైరన త్యాగాలు

కర్తవ్యమని ఖుర్‌ఆన్‌ బోధించింది. ఈ మత ప్రభావం వలన అరబ్బులు మతావేశంతో 'ఇస్లాం' వ్యాపికి కృషిచేశారు.. (ముస్లింలనే'వారు) ఇస్లాం మతం స్వీకరించని హిందువులను...అనేక మందిని వధించారు లేదా బానిసలుగా చేశారు.. '...మహమూద్‌ గజనీ అనేకమంది ('హిందాువుల'ను)ని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చాడు.., 'హిందువుల సహనాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది ముస్లిం సన్యాసులు అద్బుత శక్తులు(?) ప్రదర్శించి హిందువులను ఇస్లాం మతంలోకి మార్చగలిగారు ..(ఫిరోజ్‌ తుగక్)... ప్రజలు ఇస్లాం మతం స్వీకరించడానికి అనేక ప్రోత్సాహకరమైన బహుమతులను ప్రకటించాడు. ... (డిల్లీ) సుల్తానులలో కొందరు ఇస్లాం మతావేశపూరితులై సంకుచిత మతవిధానం అవలంబించి అనేకమంది హిందువులను హింసించి, ..వారిని బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేటట్లు చేసారు..,వారు ('ముస్లిం'లు) హిందువులను ఇస్లాం మతంలోకి మార్చాలని, భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగాతీర్చిదిద్దాలని చాలా ఉత్సాహం తోనూ, ఆవేశంతోనూ కృషిచశారు..'కొన్నిసందార్భాల్లో రాజుల ఆజ్ఞమేరకు బలవంతంగా మతమార్పిడులు జరిగాయి..'ఔరంగజేబు' అనే పాఠ్యాంశంలో, 'ఇస్లాం మత స్వీకారం చేసిన వారి (హిందువులకు)కి ప్రభుత్వోద్యాగాలు, ఇతర సౌకర్యాలు కలిగించాడు..

ఈ భావజాలాన్ని డాక్టర్‌ సాంబశివా రెడ్డి మరింత స్పష్టం చేస్తూ ఇటు వంటి పదాజాలంలోని మతతత్వ భావజాలం 'మహమ్మదీయులనే' వారిపట్ల 'హిందువులనే' వారిలో శతృభావాన్ని కల్గిస్తుంది/కల్గిస్తోంది. మహమ్మదీయుల మతాభిమానాన్ని 'మతావేశం'తో, 'విపరీతమైన మతావేశం'తో, 'మత సహనం లేనివారు' (హిందువులు మాత్రమే మతసహనంగలవారు అనే అర్థంతో) అనే (తీవ్ర) పదాజాలంతో పోల్చడం, ('ముస్లింలనే' వారు) మతం తప్ప మరో ధ్యాసలేనివారు, (బలవంతంగా) మతమార్పిడే వారి ('ముస్లింలనే'వారి) లక్ష్యంఅనే అవగాహన కలిగేటట్లు పదాజాలాన్ని రాయడం గర్హించదగింది అని వ్యాఖ్యానించారు.

ఈ రాతల వలన ముస్లిం ప్రభువుల పట్ల ముస్లిమేతర ప్రజానీకంలో తీవ్రమైన అపోహలు, అపార్థాలు చిట్లం కట్టుకపోయాయి. ప్రభువులు ఎవరైనా ప్రథమంగా రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుంటారు. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తారు. రాజ్యాధికారం ప్రధానమైన రాజ్యాధినేతలు మతవ్యాప్తిని ప్రధానంగా భావించరు. అలా భావించి తమ మతం కోసం మాత్రమే జీవించినట్టయితే హిందూ రాజులు హిందూ

263