పుట:1857 ముస్లింలు.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

రాజులు హిందూమతోద్దరణకు నడుంకట్టినవారుగా, ముస్లిం పాలకులు ఇస్లాంమత వ్యాప్తి కోసం అందర్నీముస్లింలుగా మార్చినవారుగా ప్రకటించారు. ఆయన ప్రకటన ఈ క్రింది విధాంగా సాగింది:

ఉత్తర హిందూ దేశము నుండి మహాప్రవాహముతో వెడలి దక్షిణ హిందూ దేశమందలి హిందూ మతమును హిందూ రాజ్యములను రూపుమాపుటకు సిద్దముగానున్న మహమ్మదీయులనుబడు మహానదిని రెండువందలయేబది సంవత్సముల వరకు నడ్డగించి హిందూ మతమును హిందువుల ప్రాభవమును రక్షించిన విజయనగర సామ్రాజ్యమును వేయినోళ్ళ గొనియాడినను తనివి తీరదు. క్రీ.శ 1307లో మహమ్మదీయలు దేవగిరి రామరాజును చెపట్టి; 1310లో ద్వార సముద్రంలోని బళ్ళాల రాజులనంత మొందించిరి; 1323లో నోరుగంటి ప్రతాపరుద్రుని ఢల్లీ గొంపోయిరి. ఇట్టు దక్షిణ దేశములోని హిందూ రాజ్యములన్నియునడుగంటినందున హిందూ మతము తదుద్దరణమునకు నాధారమే మియు లేకపోయెను. దక్షిణ హిందూదేశమునకట్టి విషన్నావస్థ ప్రాపించినపుడు దాని నుద్దరించుటకు నవతరించిన రాజ్యమే విజయనగర సామ్రాజ్యము. ఈ ప్రభుత్వమప్పుడు డుదయించి యుండని యెడల బదునాల్గవ శతాబ్దమునందే యనగా నేటికి నైదువందల సంవత్సరములకు బూర్వమే దక్షిణ దేశమంతయు బూర్తిగ దురుష్కులపాలై, హిందూమత మంతయు నడుగంటి, నేటికి మనమందరము మహమ్మదీయులమై యుందుమనుట యతిశయోక్తి కానేరదు. (మహమ్మదీయ మహాయుగము అను హిందూ దేశ కథాసంగ్రహము, కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, అనువాదం అక్కినేని రమాపతి రావు, సుపథ ప్రచురణలు, 2004, పేజి. 234)

ఈ రచనల ప్రభావం వలన ఆ తరువాతి తరానికి చెందిన చరిత్రకారులు తమ గ్రంథాలలో ముస్లిం ప్రభువుల పట్ల అలనాటి ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలనే సుస్థిరం చేసుకుంటూ రచనలు సాగించారు. ఆ కారణంగా పాఠ్యగ్రంథాలలో కూడా అవాస్తవాలు వాస్తవాలుగా చోటుచేసుకున్నాయి. ఆంధ్రాప్రదేశ్‌ ప్రభుత్వం ప్రచురించిన డిగ్రీ చరిత్ర గ్రంథాలలో ఈ భావజాలం ఎంత అలవోకగా ప్రవేశించిందో డాక్టర్‌ జి. సాంబశివారెడ్డి చరిత్ర పాఠ్యపుస్తకాలలో మతతత్వం నీడలు అను సుదీర్గ… వ్యాసంలో బట్టబయలు చేస్తూ ఆ విషయాలను ఈ క్రిందివిధంగా ఉటంకించారు.

'భారతదశంలో... ఇస్లాం మతాన్ని వ్యాపింపచయటం మహమ్మదీయుల పవిత్ర

262