పుట:1857 ముస్లింలు.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విస్మరణకు గురైన త్యాగాలు

మతమైన ఇస్లాం గురించి నకారాత్మక భావనలు చరిత్ర పాఠ్య పుస్తకాలలో ఏ విధంగా సాగాయో, చరిత్రోపన్యాసకులు డాక్టర్‌ జి.సాంబశివా రెడ్డి తన వ్యాసం చరిత్ర పాఠ్య పుస్తకాలలో మతతత్వం నీడలు (గీటురాయి వారపత్రిక, 28-7-2006) లో ఈ క్రింది విధాంగా ఉల్లేఖించారు:

'భారతదేశంలో ముస్లిం రాజ్యస్థాపన' అనే పాఠ్యాంశంలో, ఇస్లాం మతాన్ని వ్యాపింప జేయడం మహమ్మదీయుల పవిత్రకర్తవ్యమని ఖుర్‌ఆన్‌ బోధించింది .. ...తురుష్కులు...అరబ్బులకంటే ఆవేశపరులు, క్రూరులు. వీరు ఇస్లాం మతాన్ని స్వీకరించి విపరీతమైన (మత)ఆవేశంతో, ఉత్సాహంతో, పట్టుదలతో, హింసావిధానాన్ని అనుసరించి భారతదశంలో ఇస్లాం మత వ్యాప్తికి ఆత్రుతతో పూనుకున్నారు...' అల్లాఉద్దీన్‌ హిందువులపై భరించరానంతగా పన్నులు విధించి, మతపరంగా ద్వేషించి, హింసించాడు .. అల్లాఉద్దీన్‌ హిందువుల పట్ల క్రూరంగా వ్యవహరించాడు.. '...అతడు (నాసరుద్దీన్‌ ఖుస్రూషా) హిందువులకు అనుకూలంగా ఉండేవాడు. (అందువలన) ముస్లింలు అతనిని ఏవగించుకొనేవారు. ప్రత్యే కంగా ముస్లిం ప్రభు వర్గం ఒక హిందువు సుల్తానుగా ఉండాన్ని వ్యతిరేకించారు....,'అతడు (ఫిరోజ్‌తుగ్లక్‌) పరమతద్వేషి. చాలా సంకుచితమైన మతవిధానాన్ని (హిందాువుల పట్ల) అనుసరించాడు. ఫిరోజ్‌ స్వయంగా.. (హిందూ) ప్రజలందరనీ వధించాల్సిందిగా తన సైన్యాన్నిఆజ్ఞాపించాడు. (దీనివలన) అనేక వేల మంది హతులయ్యారు...(ఈవిధంగా) ఐదుసంవత్సరాల వరకు, ప్రతి సంవత్సరం సుల్తాన్‌ ఈ మారణహోమం గావించాడు.... 'ఆనాడు (తైమూరు దండయాత్ర సమయంలో) హిందువులు ముస్లింలకు భయ పడి తమ బాలికలకు చిన్నతనంలో వివాహం చేసారు...'బాబర్‌ దండయాత్ర నాటి భారతదేశ రాజకీయ, ఆర్థిక, సాంఘక పరిస్థితులు' అనే పాఠ్యాంశంలో, భారతదేశంలోని ముస్లిం రాజులు ఇస్లాం మతాన్ని రాజ్యమతంగా ప్రకటించారు...(షాజహాన్‌) హిందూమతాన్ని ఆదరించలదు ...ఇస్లాంమతం ఔన్నత్యాన్ని ప్రశ్నించినవారిని కఠినంగా శిక్షించాడు...'ఔరంగజేబు' అనే పాఠ్యాంశంలో, (ఔరంగజేబు) ఖాల్సా భూములనుంచి హిందువులను తొలగించాడు. ఇస్లాం మత స్వీకారం చేసిన వారికి ప్రభుత్యోద్యోగాలు, ఇతర స్ధకర్యాలు కలిగించాడు', ...అబ్దుల్‌నబి అనే ఫౌజ్దార్‌ అనేక క్రూర పనులు చేశాడు. హిందూ దేవాలయాలను పడగొట్టడమే కాకుండా అనేకమంది హిందూ స్త్రీలనుకూడ చెరపట్టాడు' 'ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక స్వరూపం'

265