పుట:1857 ముస్లింలు.pdf/261

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

ఆంగ్లేయుల రాజ్యం వస్తే తప్ప, సనాతన ధర్మం ఇక్కడ పున:స్థాపితం కాదు... ఆంగ్లేయుల రాజ్యం వచ్చేట్లయితే...హిందువులు జ్ఞానవంతులు, గుణవంతులు, వీర్యవంతులు అవుతారు...రాజదండం ఆంగ్లేయులకు రావడం కోసం సంతానులు ఇన్నాళ్ళు పనిముట్లుగా ఉండి పోరాడారు...ఆంగ్ల రాజ్యం నీవల్ల స్థాపించబడింది... పృధ్విసస్య శ్యామలం అవుతుంది. జనానికి ఐశ్వర్వంఎక్కువ అంతుతుంది...ఆంగ్లేయులు మిత్రులు. ఆంగ్లేయులతో యుధ్దం చేసి విజయం సాధించడం ఇప్పటి పరిస్థితులలో సాధ్యం అయ్యే పనికాదు. (అనందమఠం, బంకించంద్ర చటర్జీ, పేజిలు 126-128) చివరకు సదానందుని పాత్రనుద్దేశించి నీవు చేయ వలసిన పని పూర్తి అయింది. సత్యానందా! నీవిక ఇక్కడ చేయవలసినది లేదు. ఆంగ్ల రాజ్యం యిక్కడ సుస్థాపితమయి పోయింది అని ప్రకటన చేస్తాడు. (పేజి.126)

ఈ విధంగా ఆంగ్లేయుల రాజ్యం రావాలని ఆకాంక్షించింన బంకించంద్రుడు ఆంగ్లేయుల పట్ల ఆరాధానా భావాన్నివ్యక్తం చేశాడు. ఆయన రాసిన 'రాజసింఘ' (Rajasingha) లో ఔరంగజేబు గురించి రాస్తూ అతడు మహిళల చేతిలో బంది అని దారుణమైన వ్యాఖ్యా చేస్తాడు. ఆంగ్లేయ చరిత్రకారులు ఆశించిన విధMగా ముస్లిం పాలకులను, పాలనను తూలనాడడు.

ఈ వాతావరణం కొందరికి మాత్రమే వరకు పరిమితం కాలేదు ! ఆనాటి మేధావుల రచనల్లో, మాటల్లో, ప్రవర్తనలలో ముస్లింల నియంతృత్వపాలన కంటె ఆంగ్లేయుల పాలన చాలా మెరుగైనది అన్నభావన బలంగా వెల్లడయ్యిందని Hindu Revivalism in Bengal గ్రంథ రచయిత K.K. Ghatak పైన ఉదాహరించిన విషయాలన్నిటిని ఉటంకిస్తూ, This was the general attitude of the leading men of the period. Their nationalism was Hindu Nationalism and they preferred British rule of Law to Muslim Tyranny అని అభిప్రాయపడ్డడు. (For more information see K.K. Ghatak, Hindu Revivalism in Bengal : Rammohan to Ramakrishna, Calcutta,1991, Pp 34-35)

ఆ తరువాతి రోజుల్లో జాతీయవాదం, పునరుద్ధరణవాదం జోడు గుర్రాల్లా సాగాయి. ప్రయాజనవాదులెన ఆంగ్లేయ చరిత్రకారులు సృష్టించిన అవాస్తవ, వక్రీకరణల చరిత్ర ఆధారంగా చరిత్ర రచనకు పూనుకున్న జాతీయవాద-పునరుద్దరణవాద చరిత్రకారులు జాతీయవాద భావజాలానికి తిరుగులేని బలాన్ని తక∆ణమే చేకూర్చాలన్న

258