పుట:1857 ముస్లింలు.pdf/262

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విస్మరణకు గురైన త్యాగాలు

తహతహలో హిందూ రాజులుగా తాము భావించిన వారితో యుద్ధాలు చేసన వారందరినీ పరాయి దేశస్థులుగా/పరాయివారుగా చిత్రీకరీంచారు. ముస్లిం రాజులతో యుద్ధాలు చేసినవారందర్ని జాతీయవాదులుగా అభివర్ణించారు.

ఈ క్రమంలో అచారిత్ర కం గా జాతీయ పోరాటాలు, జాతీయెయోధ్యమం, విమోచనోద్యమం వంటి భావజాలాన్ని పొందుపర్చడం జరిగింది. కాకతీయులు, రాజపుత్రులు, విజయనగర రాజులు, మహారాష్ట్రులు వంటి హిందూరాజులు, ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, మొఘలులు వంటి ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా చేసిన రాజకీ య యుద్ధాలను 'జాతీయ పోరాటాలు'గా,'జాతీయోధ్యంమం'గా, 'విమోచనోద్యమం'గా పేర్కొంటున్నారు. (చరిత్ర పాఠ్యపుస్తకాల పై మతతత్వం నీడలు, డాక్టర్‌ జి. సాంబశివారెడ్డి, గీటురాయి వారపత్రిక, 2006 ఆగష్టు 4). ఈ మేరకు సాగిన చరిత్ర రచనలో ముస్లింల మీద ఆంగ్లేయుల సాగించిన దుష్ప్రచారాన్ని స్వదేశీ చరిత్రకారులు యథాతదగా స్వీకరించారు. ప్రదానంగా ముస్లిం పాలకుల నియంతృత్వం, కిరాతకత్వం,మతదురహంకారం అను అంశాల చుట్టూతా చరిత్ర రచన సాగించారు.

ఈనాటికీ ఈ ప్రభావం మన విద్యార్థులు అధ్యయనం చేస్తున్న సెక్యులర్‌ ప్రభుత్వ చరిత్ర పాఠ్య పుస్తకాలపై ఎంత తీవ్రంగా ఉందన్న విషయాన్ని డాక్టర్‌ జి. సాంబశివా రడ్డి సోదాహరణంగా వివరించారు. జాతీయవాదుల నిర్వాకం వల్లనే భారతదశ చరిత్రలో మహోజ్వలమైన భారతీయ/ హిందూ సంస్కతి', ముస్లింపాలన/విదేశీ పాలన, హిందూ-ముస్లీంపోరాటాలు, హిందూ-ముస్లిం సంస్క ృతి, జాతీయ వీరులు, సfiతంత్ర హిందాూ సామ్రాజ్యం, సfiతంత్ర (ముస్లిం) మహమ్మదీయ సామ్రాజ్యం వంటి ధోరణులు/భావాలు ప్రవేశించి, ఘనీభవించాయి. వీటివలన మతతత్వ భావజాల-మతతత్వ చరిత్ర రచనా దృక్పథం బలపడింది.' (చరిత్ర పాఠ్యపుస్తకాల పై మతతత్వం నీడలు, డాక్టర్‌ జి.సాంబశివారెడ్డి, గీటురాయి వారపత్రిక, లై 14, 2006) అను పదాలు, వాక్యాలు ఉదృతంగా కన్పిస్తాయి.

ఆ కారణంగా మతతత్వ చరిత్ర దృక్పథం గుండా ముస్లిం వ్యతిరేక చరిత్ర తిన్నగా పాపులర్‌ చరిత్ర గ్రంథాలు, పాఠ్యగ్రంథాలు, కళా-సాహిత్య రంగాలలో ప్రవేశించింది. ఆ మీదట మతతత్వ భావజాల-మతతత్వ చరిత్ర రచనా దృక్పథం చరిత్ర రచనలో మరింత బాగా బలపడింది. ఈ వరవడిలో ఉద్భవించిన గ్రంథాలలో, సాహిత్య-

259