పుట:1857 ముస్లింలు.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విస్మరణకు గురైన త్యాగాలు


భావించి యథాతదంగా స్వీకరించారు. ఆయన కంటె మరొక అడుగు ముందుకేసి తమదైన శైలిలో ఆంగ్లేయ చరిత్రకారులు సృష్టించిన భావజాలానికి మరింత పదనుపెట్టారు.

ఆ క్రమంలోద్వారకానాథ్‌ టాగూరు, రాజనారాయణ బసు, బంకిం చంద్రా ఛటర్జీ లాంటి ప్రముఖులు రాజా రాంమోహన్‌ రాయ్‌ భావాల అడుగుజాడల్లో నడిచారు. బ్రిటిష్‌ ప్రభుత్వం అందించిన వరాలను వివరిస్తూ ద్వారకానాథ్‌ ఠాగూర్‌ ముస్లింల పాలనను తీవ్రంగా దుయ్యబట్టారు. ఆధునిక జాతీయవాద పితామహుడుగా ఖ్యాతిగాంచిన రాజనారాయణ బసు తన ప్రసిద్ధ బెంగాలి గ్రంథం Viridha Hindur Asha (Old Hindus Hope) లో ప్రతిపాదించిన మహాసమితిలో మనుస్మతి ప్రకారం ముస్లింలకు స్థానం లేదాన్నాడు. ముస్లింలు ప్రత్యేకంగా తమదైన మహా ముస్లిం సమితిని ఏర్పాటు చేసుకోవాలని సూచించాడు.1886లో రాసిన ఈ గ్రంథంలో వేర్పాటువాద బీజాలను నాటారు. బసు సహచరుడు నాబగోపాల్‌ 1867లో జాతి మేలా ఆరంభించగా, అదికాస్తా హిందూ మేలాగా రూపాంతరం చెంది యవనుల (ముస్లింల) పట్ల కఠినంగా వ్యవహరించాలన్నది; పూర్వం సంస్కతి-సభ్యతల ఔన్నత్యాన్ని పునరుద్ధారించాలన్నదే హిందూ మేలా ప్రధాన ఆశయమని ప్రకటితమైంది.

ఆ తరువాత రంగప్రవశం చేసన బంకిం చంద్ర చటర్జీ తాను రాసిన ఆనందమఠం నవలలోని పాత్రల ద్వారా ముస్లిం పాలన పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశాడు. ఆంగ్లేయ చరిత్రకారుల బాటలో సాగుతూ బెంగాలు నవాబును కుల సంపదల రక్షణ విశ్వాసఘాతకుడు, మనుష్యులలో కళంకుడు...ఆత్మరక్షణ చేసుకోలేని బలహీనుడు. ..కడుపునిండ తాగి పడుకుంటాడు అని తూలనాడాడు. (ఆనంద మఠం, బంకించంద్ర చటర్జీ, జయంతి పబ్లికేషన్స్‌, విజయవాడ, ఆగష్టు 1998, పేజి. 20). మహామ్మదీయ పాలనలో ధర్మం జరగదని చెబుతూ మహమ్మదీయులను పాలద్రోలితే మాత్రమే ధర్మం నిలుస్తుంది అని పాత్రల ద్వారా పలికిస్తాడు (పేజి. 31). నవాబుల ఇల్లు దోచి సముద్రంలో కలిపివేయాలన్న సంకల్పంతో వున్నాము, ఇప్పుడ తరుణం ఆసనన్నమైంది అంటాడు. (పేజి. 59). ఈ విధంగా ముస్లిం పాలకుల పట్ల వ్యతిరేకతను వ్యక్తంచేసిన బంకించంద్ర అనందమఠం నవల చివరల్లో ఆంగ్ల రాజ్యం స్థాపనపట్ల అత్యంత మక్కువ చూపుతాడు.

ముస్లింల పాలన అంతరించి ఆంగ్లేయుల పాలన కావాలని కోరుకున్నబంకిం చంద్రుడు తన నవలలోని పాత్రలద్వారా తన వాంఛను ఈ విధంగా వ్యక్తం చేశాడు

257