త్యాగాలొకరివి-భోగాలొకరివి
బ్రిటిషు వారి సంఖ్య ఎంత? మీరు వారికెందుకు దాసోహమనాలి? ఎదురు తిరగండి. దేశ ప్రజలందరు మీకు అండగా వుంటారు. పరాయి పెత్తనం వద్దు. స్వతంత్రంగా వ్యవహరించండి! లక్షమంది భారతీయులు ఒక్కొక్క ఇంగ్లీషు వాడిని తన్నితే చాలు. అసువులు బాసిపోతారు. వారు చచ్చిన జాడ తెలుపడానికి కూడ ఎవ్వరూ ఉండరు. ధైర్యం చేయండి. దేశమాత పిలుపు వినండి. ఆమెను పరాధీనం చేయకండి! అని ప్రజలు నిజాంకు ప్రజలు విజ్ఞప్తులు చేసినా (హైదారాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర, వెల్దుర్తి మాణిక్యరావు, స్వాతంత్య్రోద్యమం చరిత్ర పరిశోధనా సంస్థ, హైదారాబాద్, 1984 పేజి.49)
బహదాూర్ అఫ్జలుద్దౌలా మీద భగవంతుని, ముహమ్మద్ ప్రవక్త దయ ఉంది. ఆయన భయపడకుండా ఉండాలి. ఒకవేళ భయపడినట్టయితే గాజులుతొడుక్కొని ఇంటి దగ్గర కూర్చోవడం మంచిది...ఈ పోస్టర్లలో రాసిన ప్రకారంగా బహద్ధూర్ ప్రవర్తించనట్టయితే ఢిల్లీ నుండి ఇంకొక సుభా వస్తుంది, అంటూ సంస్థానాధీశుడ్ని అవహేళన చేసినా, నిజాం ప్రభువు మాత్రం ఆంగ్లేయుల పక్షమే వహించాడు. (నిజాం-బ్రిటిష్‌సంబంధాలు (1727-1857), సరోజినీ రెగానీ, మీడియా హౌస్ పబ్లికేషన్స్ , హెదారాబాద్, 2002 పేజి. 319-320)
1857 తిరుగుబాటు సమయంలో ఆంగ్లేయాధికారులు నిజాం పట్ల చాలా అప్రమతులై వ్యవహరించారు. అత్యంత సన్నిహితులుగా,స్నేహితులుగా మసలుకున్నారు. ప్రతిఫలంగా నిజాం కూడా తిరుగుబాటు సమాచారాన్ని బ్రిటిష్ రెసిడెంటుకు చేరవేస్తూ, స్వయంగా చర్యలు తీసుకుంటూ తిరుగుబాటును అణిచిన పాపంలో పాలు పంచుకుని ఆంగ్లేయుల మన్నన పొందాడు.
ఆనాడు ఆంగ్లేయులు తిరుగుబాటును కఠినంగా అణచివేయడానికి, వలస పాలకుల చేతుల్లో స్వదేశీ పాలకులు, ప్రజలు పరాజితులు కాడానికి ఆంగ్లేయులకు కొందరు సంస్థానాధీశులు ఎంత ఘనంగా సహకరించారో ఈ సంఘటనలు స్పష్టం చేసున్నాయి. రాజ్యాన్ని కాపాడుకోగలిగినంతగా సహాయసహకారాలు అందించారు కనుక ఆ తొత్తులకు ఆంగ్లేయులు బాగానే నజరానాలు ముట్ట చెప్పారు. ఖాన్ బహదాూర్, రావు బహదూర్ లాంటి అవార్డులను, ప్రశంసాపత్రాలను (ఖతీరా) వారికి సమర్పిం చుకున్నారు. అత్యంత విలువైన బహుమతులను అర్పించుకుని ఎంతగానో సంతోష పెట్టారు.
స్వదేశీ సంస్థానాధీశులను అవార్డులు-రివార్డులతో మంచి చేసుకుని, తమ
243