పుట:1857 ముస్లింలు.pdf/247

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

పక్షాన నిలుపుకున్నంత కాలం తాము నిశ్చింతంగా ఇక్కడ పెత్తనంచేస్తూ ఇక్కడి సంపదనంతా తమ బొక్కసాల్లొ నింపుకుని లండన్‌ తరలించవచ్చనీ, ఇక్కడి ప్రజలను యధేచ్ఛగా పాలించవచ్చనీ ఆంగ్లేయాధికారులు గ్రహించారు. ఆ లక్ష్యం సాధనాదిశగా నడుచుకుని మిత్రులుగా వ్యవహరించిన సంస్థానాధీశుల, కులీనవర్గాల పెద్దల సహకారంతో ఇబ్బడి ముబ్బడిగా సాకుకూల ఫలితాలను సాధించారు.

ఆంగ్ల సైనికులకు తోడ్పాటు అందించినందుకు మసలన్‌, పాటియాల, జింద్‌, కశ్మీర్‌, నాభా, కపుర్తలా, హైదారాబాదు సంస్థానాధీశులకు అంగ్లేయులు మరోరకంగా కూడా సంతృప్తి పర్చారు. అనాడు తిరుగుబాటులో ప్రదాన పాత్ర వహించి ఆంగ్లేయులతో రాజీలేని పోరాటం సాగించిన అవధ్, గుర్‌గాంవ్‌, రోహిల్‌ ఖండ్‌, ఫరూఖ్‌నగర్‌ నవాబులు, సంస్థానాధీశుల రాజ్యాలలోని పలు ప్రాంతాలను తమకు తొత్తులుగా వ్యవహరించిన రాజ్యాధినేతల, సంస్థానాధీశుల రాజ్యాల సరిహద్ధులను బట్టి తిరుగుబాటు యోధుల రాజ్యాలలోని పలు ప్రాంతాలను ధారాదాత్తం చేశారు. ఈ విధాంగా పటౌడి నవాబుకు ఝుజ్జర్‌ రాజ్యంలోని ఇలాఖా, సింధియా మహారాజుకు రాణి లక్ష్మీబాయికి చెందిన ఝాన్సీ లభించాయి. దాదరీ పరగణాను జునైద్‌ మహారాజాకు ప్రదానం చేసి ఆంగ్లేయులు కృత్ఞతాభివందనాలు చెల్లించుకున్నారు. (గదర్‌ 1857 మొయినుద్దీన్‌ హసన్‌)

ఈ చర్యల వలన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం విఫలం కావడానికి తోడ్పడి, పచ్చి విద్రోహానికి పాల్పడి ఆంగ్లేయులకు అండగా నిలచిన, పరాయి పాలకుల ఎంగిలి మెతుకులకు, వారి దయాదాక్షిణ్యాల కోసం వెంపర్లాడిన స్వదేశీయులు, స్వదేశీపాలకులు ఎంతగానో లాభించారు. ఆంగ్ల ప్రబుత్వం భృత్యులుగా, స్నేహితులుగా అంతులేని సంపదను పోగేసుకున్నారు. ప్రజల మీద తిరుగులేని ఆధిపత్యాన్నిసంపాదించుకున్నారు, అదుపులేని పెత్తనం చలాయించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం కూడాతమకు తొత్తులుగా మెలగిన సంస్థానాధీశులు సుఖభోగాలు అనుభవిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా తమ స్నేహం మరువకుండా విశ్వాసపాత్రులుగా పడి ఉండేందుకు అన్నిచర్యలు తీసుకుంది. అన్ని అవకాశాలు కల్పించింది. ఆ విధంగా వచ్చి చేరిన అపార సంపదతో ఆంగ్లేయుల మిత్రులుగా వ్యవహరించిన సంస్థానాధీశులు అపర కుబేరులయ్యారు.

ఆ తరువాత కాలంలో ఆ సంస్థానాధీశుల వారసులు కూడాఆంగ్లేయుల అడుగులకు మడుగులొత్తుతూ ఆంగ్లేయుల మిత్రులుగా, ఆంగ్ల ప్రబుత్వం దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతూ సంస్థానాధీశులుగా, ఆ తరువాత జమీందారులుగా ప్రజల మీద

244