పుట:1857 ముస్లింలు.pdf/245

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

మీర్‌ నుండి రణనినాదం చేస్తూ ఢిల్లీ చేరుకున్న తిరుగుబాటు యోధులను కట్టడి చేయడానికి పంజాబ్‌ నుండి ఆంగ్ల సైన్యాలతో జనరల్‌ ఆన్స్‌ బయలుదేరినప్పుడు దారిలో ఆంగ్ల సన్యాలకు ప్రజల నుండి, తిరుగుబాటు యోధు లనుండి ఎటువంటి ఇక్కట్ల్లూ రాకుండా ప్రయాణ మార్గాన్ని సంరక్షించే బాధ్యతను పాటియాల మహారాజు, జింద్‌ రాజు చేపట్టి ఆన్స్‌కు సహకరించారు.

ప్రథమ స్వాతంత్య్రసమరాన్ని అణచివేయటంలో ప్రధాన పాత్ర వహించిన ఆంగ్ల సైనికాధికారి సర్‌ ఛార్లెస్‌ అట్చిసన్‌ (Sir Charles Aitchison) మరోచోట స్వదేశీ సంస్థానాధీశులను ప్రశంసిస్తూ మా కష్టకాలంలో స్వదేశీ సంస్థానాలు మాకు వెలలేని సేవలను అందించాయి. స్వదేశీ ప్రముఖులను సక్రమంగా చూసుకోవడం వలన మా పరిపాలనకు భద్రత బాగా పెరిగింది అన్నాడు.

మరోఆంగ్ల సైనికాధికారి, A History of the Indian Mutiny రచయిత జాన్‌ విలియం కేయి (Jhon William Kaye) ఈ విషయాన్నేమరింత బలంగా చెబుతూ ఆంగ్లేయులు స్థానిక జాతులకు వ్యతిరేకంగా పోరాడుతున్నఆంగ్లేయులకు మద్దతుగా నిలచి సహకరించింది స్థానికులుకావటం తిరుగుబాటు-యుద్ధం ప్రత్యేక లక్షణం. స్థానికుల మద్దతు లేకుండా మేం ఒక్కరోజు కూడా ఇక్కడ మనజాలగలిగేవారం కాము అని అంగీకరించటం విశేషం.

(It was one of the most curious characteristics of the mutinywar, that although the English were supposed to be fighting against the native races, they were in reality sustained and supported by the Natives of the country, and could not have held their own for a day with out the aid of those whom we hated as our national enimies)

ఈ వరవడిలో ఇండియాలో అతి ముఖ్యమైన సంస్థానాధీశుడు, ఆంగ్లేయుల మిత్రుడు నైజాం నవాబుల పట్ల కూడ ఆంగ్లేయులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. టిపూ సుల్తాన్‌ కాలం నుండి ఆంగ్లేయలతో దస్నేహం నెరపిన నిజాం జారిపోయినట్టయితే అంతా జారి పోయినట్టే అని బ్రిటిష్‌ అధికారులు స్వయంగా ప్రకంచుకున్నారు. అందుకు తగినట్టుగా వ్యవహరించారు. (History of The Deccan Vol. II, JD E Gribble, Mittal Publications, New Delhi, 1990, P.236)

ఆ కారణంగా వందలాది మైళ్ళదూరం నుండి సముద్రం మీద వచ్చిన

242