పుట:1857 ముస్లింలు.pdf/243

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

వారసులు మాత్రమే కాకుండా అలనాటి యోధుల వారసులు కూడ ఎదుర్కొంటున్న దుర్భర దారిద్య్ర పరిస్థితులను మీడియా కథలు కథలుగా విన్పించడాన్ని మనం చదువుతున్నాం చూస్తున్నం, తెలుసుకుంటున్నం.

1857నాటి సంగ్రామంలో ప్రజల మధ్య పటిష్టమైన ఐక్యత వ్యక్తమైనా, అందరూ ప్రాణాలకు తెగించి పోరాడినా భారతీయులు పరాజితులు కావటం వెనుక గల ప్రధాన కారణాలలో ఆనాటి సంస్థానాధీశులలో కొందరు విద్రోహానికి పాల్పడాన్నీ ప్రధానంగా పేర్కొనవచ్చు. స్వదేశీ పాలకులు, సంస్థానాధీశులు, స్వదేశీ సైనికులు, ప్రజలు కలసి కట్టుగా ఉమ్మడి శత్రువు మీద సమరశంఖారావం పూరించగా మరికొందరు ప్రత్యక్షంగా పోరాటంలో తాము పాల్గొనక పోయినా ఆ పోరాట యోధులకు సహాయం చేయాల్సింది పోయి ఆంగ్లేయుల పక్షాన నిలిచారు.

ఈ విధంగా బ్రిషర్ల తొత్తులుగా మారిన వారి వల్లే ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ యోధులు పరాజితులయ్యారు. ఆ ద్రోహులే ఆంగ్లేయులకు విజయాన్ని సమకూర్చిపెట్టారు. ఈ విద్రోహ చర్య లను ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామంలో స్వయంగా పాల్గొన్న ఆంగ్లేయాధికారులు, ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు, తిరుగుబాటును తమ పత్రికలకు రిపోర్టు చేయడానికి ఇక్కడకు వచ్చిన ఆంగ్లేయ పాత్రికేయులు చాలా స్పష్టంగా ప్రకటించి ఆ విద్రోహుల చర్యలను నమోదు చేసి చరిత్రకందించారు.

ఆ చరిత్ర కథనం ప్రకారంగా, ఆనాటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కానింగ్ స్వదేశీ పాలకుడైన సింధియా తమకు ఏవిధంగా సహకరించిందీ, సింధియా సహకారం ఆంగ్ల ప్రభుత్వానికి ఏ విధంగా లాభించింది వివరిస్తూ- If Sindia joins the rebels, I will pick off tomorrow....The Princes acted as the break waters to the storm which otherwise would have swept us in one wave అని పచ్చి వాస్తవం పలికాడు. ( 'Untold history of Freedom Struggle' M. Burhanuddin Qasmi, The Milli Gazette, 16-31 May 2007)

స్వదేశీపాలకులలో ప్రముఖులైన కాశ్మీర్‌, హైదారాబాద్‌, గ్వాలియర్‌, జింద్‌, నభా, కపుర్తలా, ఉదయపూర్‌, జైపూర్‌, అల్వార్‌, కోఠా, భోపాల్‌,పటొడి, నేపాల్‌, శిక్కు పాలకులు, మరాఠాలు, సింధియాలు, జోధపూర్‌, గ్వాలియర్‌ తదితర రాజకుటుంబాలు, రాజస్థాని రాకుమారులు పెద్ద సంఖ్యలో బ్రిటిష్‌ పాలకుల తొత్తులుగా మారారు. ఈ

240