పుట:1857 ముస్లింలు.pdf/242

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


త్యాగాలొకరివి-భోగాలొకరివి

ఆ ఇలాహీ బక్ష్ ముని మనుమరాలు తైమూర్‌ జహా బేగం ప్రస్తుతం ఢిల్లీలోని సలీం ఖాన్‌ వీధిలో ఉంటున్నది. ఆంగ్లేయులు మీర్జా ఇలాహీ బక్ష్ మీద అపార కరుణను కురిపించారు. మా నాయనమ్మ ఆయన చెల్లెలు కూతురు కావటంతో మాకు కూడా అరకొరగా పెన్షన్‌ లభించింది. బపదాూర్‌ షా జఫర్‌ పేరు మీద మాత్రం మాకు ఏమీ లభించేది కాదు...మేము ఎవ్వరం కూడా మొగల్‌ ప్రబు వుల వారసు లమని ప్రచారం చేసుకోలేదు. మా మానాన మేం బ్రతుకుతున్నాం. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తే చాలు. మాకింకా అంతకంటే ఏమీ అక్కరలేదు. మేం ప్రభుత్వసహాయం కూడాకోరలేదు.

మీర్జా ఇలాహి బక్ష్ ముని మనుమరాలు పలు చోట్లకు వెళ్ళి ప్రదమ స్వాతంత్య్ర

సంగ్రామ యోధుల పోరాటాల గురించి

1857 ముస్లింలు.pdf

రంగూన్‌లో సాదాసీదా బ్రతుకు గడిపినబేగం జీనత్‌ మహల్‌

ప్రసంగాలు చేస్తున్నానని మాతో చెప్పింది. ఆ ప్ర సంగాల ద్వారా నీక లాభం చేకూరుతున్నట్టయితే మేం ఎటువంటి ఆటంకాలు కల్పించబోమని ఆమెతో నేను చెప్పాను, (ఆజ్‌కల్‌ (హింది) మాసప తిక, మే 2007, న్యూఢిల్లీ, పేజి.42-45).

ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం నాటిద్రోహులలో ఒకడైన మీర్జా ఇలాహి బక్ష్ వారసురాలు తైమూర్‌ జహాం బేగం ప్రస్తుతం అలనాటి వాస్తవ చరిత్రకు భి న్నంగా త వంవంశ స్తుల గురించి గొప్పలు చెప్పుకుండా, వాటిని ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామం నాటి త్యాగమయ గాథలుగా ప్రసంగాలలో వర్ణిస్తూ ఆమె ఏవిధగా లబ్దిపొందుతున్నదో కమర్‌ సుల్తానా పాత్రికేయులు ఇబ్బార్‌ రబ్బీవివరించారు. ఈ మేరకు తైమూర్‌ జహా బేగం అన్ని రకాల అవకాశాలను సొమ్ముచేసు కుంటూ హాయిగా బ్రతికేస్తుండగా, ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామంలో అన్నీత్యాగం చేసన అసలు సిసలైన యోధు ల నిజమైన వారసు రాలైన కమర్‌ సుల్తానా బ్రతుకును భారంగా గడు పుతున్న దుస్థితి 1963 లో వెల్లడయ్యింది. ఈవిధంగా పలు ప్రాంతాలలో మొగల్‌ ప్రభువుల

239