పుట:1857 ముస్లింలు.pdf/244

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


త్యాగాలొకరివి-భోగాలొకరివి

స్వదేశీ పాలకులంతా ఆంగ్లేయులకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను సహాయం అందించారు. ఈ పాలకుల సహకారం వల్లే ఆయా ప్రాంతాలలో స్వదేశీ సైనికులు, ప్రజలు ఆరంభించిన తిరుగుబాట్లను ఈస్ట్‌ఇండియా కంపెనీ పాలకులు అణిచి వేయగలిగారు.

ఈ విషయాన్ని లండన్‌ నుండి ప్రచు రితమవుతున్న టైంస్ పత్రిక పాత్రికేయుడు విలియం రస్సెల్‌ వివరించారు. ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ వార్తలను తన పత్రికకు పంపించేందుకు రస్సెల్‌ లండన్‌ నుండి ఢిల్లీ వచ్చి స్వయంగా ఆనాటి పరిస్థితి చూసి వార్తలను పంపించాడు. ఆంగ్లేయ పాత్రికేయుడు తన పత్రికకు సమాచారం పంపుతూ ఆనాడు పాటియాల, హర్యానాలోని జింద్‌ రాజుల సహకారం కనుక ఆంగ్ల సైన్యాలకు లభించకుండా ఉండి ఉన్నట్టయితే, శిక్కులను ఆంగ్ల సెన్యంలో చేర్చుకోకుండా ఉన్నట్టయితే డిల్లీని స్వాధీనం చేసుకోవడం చాలా కష్టమయ్యేదన్నాడు. లక్నోలో శిక్కు సైనికులు మంచి సేవలందించారని పేర్కొన్నాడు. శిక్కులు సైనికులుగా ఉండటం వలన ఆంగ్ల సైనిక బలగాలకు మంచి శక్తి లభించిందని రాశాడు. ఈ విషయాలు 1858 మే9 నాటి టైంస్ పత్రికలో ఈ క్రింది విధంగా ప్రచురితమయ్యాయి.

(Our Siege of Delhi would have been quite impossiable if the Rajahs of Patiala and of Jhind had had not been our friends, and if the Skhs had not recruited(in) our battalions, and remainend quite in Punjab. The Sikhs at Lucknow did good service... as our arimies were atttending and strengthened by them in the field - Essay titled ' Betrayal of the First War of Independence', Prof. Shamshul Islam, The Milli Gazette, 16-31 May 2007)

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం విఫలం కావడానికి, ఆంగ్లేయులు విజయం సాధించడానికి ఆంగ్లేయుల ప్రతిభా సామర్ద్యాల కంటే ఇండియాలోని ఆంగ్లేయుల తొత్తుల సహకారమే ప్రముఖ కార ణ మని ఆంగ్లేయ పాత్రికేయుడు విలియం రస్సెల్‌ అభిప్రాయపడ్డారు. ఆయన తన పత్రికకు వార్త రాస్తూ వాస్తవం ఏమిటంటే తిరుగుబాటు మీద మనం సాధించిన విజయం యక్క ఖ్యాతి మనవాళ్ల కంటె మన శ్రేయాభిలాషులకు దక్కుతుంది. తమ స్వదేశీయుల నుండి ఎంతో ధైర్యసాహసాలతో విజయాన్ని సాధించి మనకు అప్పగించారు, అని అన్నాడు. (Jaynthe se jude kuch sawal, Prof. Shamshul Islam)

241