Jump to content

పుట:1857 ముస్లింలు.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్యాగాలొకరివి-భోగాలొకరివి

ఆమె మరణంచాక ఆమె బిడ్డడు , అవధ్‌ వారసుడు బిర్జిస్‌ ఖదీర్‌ అడ్దు కూడా తొలగించుకుని అవధ్‌ మీద పూర్తి ఆధిపత్యం సాగించేందుకు బ్రిటిషర్లు కుట్ర పన్నారు. ఆ కుట్రలు -కుతంత్రాలను బిర్జిస్‌ ఖదీర్‌ ఎదుర్కొంటూ వచ్చారు.

ఆ తరువాత తలెత్తిన కొన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు కలకత్తా రమ్మని ఆయనను ఆంగ్లేయులు ఆహ్వానించారు. ఆ ఆహ్వనం మేరకు సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు కలకత్తా వచ్చిన బిర్జిస్‌ ఖదిర్‌ గౌరవార్థం 1893 ఆగస్టు 13న ఆంగ్లేయులు రాచవిందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు కుమారుడు ఖుర్షీద్‌ ఖదీర్‌, కుమార్తె జమాల్‌ ఆరా బేగంలతో సహా బిర్జిస్‌ ఖదీర్‌ హాజరయ్యారు. ఆంగ్లేయులు పథకం తమ ప్రకారంగా విందు కోసం తయారు చేసన ఆహార పదార్థాలలో విషం

కలిపి, ఆ పదార్థాలను వారికి వడ్డించారు.

పరాయి పాలకుల ఆతిథ్యంలో నున్న దుష్ట బుద్ధిని, అందులో దాగి ఉన్నకుట్రనూ గ్రహంచలేక అమాయకంగా విషాహారాన్ని స్వీకరించిన బిర్జిస్‌ ఖదీర్‌, ఇరువురు బిడ్డ లతో సహా ప్రాణాలు విడిచారు. బిర్జిస్‌ ఖదీర్‌ భార్య మొహబత్‌ ఆరా బేగం, చిన్నకుమార్తె హుస్నా అదా బిర్జిస్‌ ఖదీర్‌ బేగం ఆ విందుకు హాజరు కాక పోవడంతో బ్రిటిషర్ల ప్రాణాంతక కుట్ర నుండి బతికి బయట పడగలిగారు. ఆ తరువాత కూడా ఆ బిర్జిస్‌ ఖదీర్‌ కుటుంబ సభ్యులను ఆంగ్లేయులు వదిలిపెట్టలేదు. ఆ రాచ కుటుంబం ఆంగ్లేయుల నిర్లక్ష్యానికి గురయ్యి బ్రతుకు గడవడనికి ప్రకించిన పెన్షన్‌ డబ్బు కోసం అధికారుల దాయా దాకి∆ణ్యాల మీద ఆధారపడాల్సిన దుస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. (అవధ్‌ కీ బేగం (హిందీ), డాక్టర్‌ సుధా త్యాగి, భారత ప్రభుత్వ ప్రచురణలు, న్యూఢిల్లీ, 1992, పేజీ 20)

భారత దేశాన్ని పాలించిన మొగల్‌ ప్రభువులలో చివరి వాడు, ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ నాయకుడు బహదూర్‌ షా జఫర్‌ వారసులు కూడా ఈ కోవలోకి చేరు కున్నారు. మూడు వందల సంవత్సరాలకు పైగా రాజ్యమేలి, 'ది గ్రేట్ మొగల్‌ ఎంపైర్


233