పుట:1857 ముస్లింలు.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

అని శత్రువు చేత కూడా కీర్తించబడిన మొగల్‌ వంశస్థులు 1857 తరువాత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ప్రథమ స్వాతంత్య్రసంగ్రామానికి ప్రతీకగా నిలిచారన్న ఆగ్రహంతో బహదూర్‌ షా జఫర్‌ పట్ల రాక్షసంగా వ్యవహరించిన ఆంగ్లేయుల చర్యల ఫలితంగా ఆయన వారసులు పూట గడవటం కూడా కష్టమై భారంగా బ్రతుకులీడ్చారు.

బహదూర్‌ షా జఫర్‌ మీద సైనిక విచారణ జరిపిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు తిరుగుబాటు యోధు లను తమ ప్రాంతాలకు దూరంగా ఉంచాలన్న ఆంగ్లేయుల విధానంలో భాగంగా జఫర్‌, ఆయన భార్య జీనత్‌ మహల్‌ను, జఫర్‌ వారసులు మిర్జా జవాన్‌ భక్త్‌, మిర్జా షా అబ్బాస్‌ వారి భార్యలు మరికొంత మంది సేవకులతో 1858 అక్టోబర్‌ 7న రంగూన్‌ తరలించారు. ఆ విధంగా రంగూన్‌ చేరుకున్న బహదూర్‌ షా జఫర్‌ 1862 నవంబరు 7న అతి సామాన్యుడిగా చివరిశ్వాస విడిచారు.

చక్రవర్తి మరణించినా అయన పట్ల విద్వేషం తగ్గని ఆంగ్లేయులు ఆయన అంత్యక్రియల పట్ల గానీ, ఆయన సమాధి పట్ల ఎంటువంటి శ్రద్ధా చూపలేదు. ప్రజలు ఆయన సమాధిని చూడలన్నాకంపెనీ ప్రభువులు అనుమతించలేదు. ఆ కారణంగా కొంత కాలం తరువాత మొగల్‌ చక్రవర్తి సమాధి ఎక్కడుందో కూడాతెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిని ముందుగా ఊహించిన జఫర్లోని కవి, నామకరణం తరువాత ఎవరెనా ఎక్కడ ఫాతెహా చదువుతారు? నా సమాధి జాడలు కూడా కనీసం కన్పించవు కదా అంటూ జఫర్‌ తనలో తాను ప్రశ్నించుకుంటూ తనలో రగిలిన ఆవేదనను ఆ విధాంగా కవిత్వీకరించుకున్నాడు.

(After the death of Zafar ! where can one recite the Fatiha? For even the sign of a broken grave that had remained is obliterated through tramping and treading heavily up and down.' - Bahudur Shah II and The War of 1857 in Delhi with Its Unforgettable Scenes, Mahdi Husain, M N Publishers and Distributors, New Delhi,1987, P. 429)

అంతేకాదు తన సమాధి వద్ద పుష్పాలు సమర్పించడానికి ఎవరైనా ఎందుకు రావాలి ? ఎవరైనా ఫాతెహా చదవడానికి ఎందుకు రావాలి? అని ప్రశ్నించుకున్నారు.

(' Why Should anyone come to my grave with an offering of flowers ? Why should anyone visit my grave to recite Fatiha ? such an embodiment of misery I shall become, on dying' - Bahudur Shah II, Mahdi Husain, P. 431)

234