పుట:1857 ముస్లింలు.pdf/218

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంగ్లేయుల రాక్షసత్వం


పేల్చివేత శిక్షను అనుభవించేందుకు ఆ స్థలంలో వేచి ఉన్న ఇతరులు పడుతున్న మనోవేదనా స్థితిని ఆంగ్లేయాధికారులు క్రీడావినోదంగా వివరిస్తూ తమ కుటుంబీకులకు లేఖల ద్వారా, ఉన్నాతాధికారులకు నివేదికల ద్వారా తెలుపుకున్నారు.

ఈ విధంగా తిరుగుబాటుయోధును ఫిరంగి ఘొట్టాలకు కట్టి పేల్చివేసిన సంఘటన దాృశ్యాన్ని నిజాం సంస్థానం పరగణాలోని బ్రిటిష్‌ సైనికాధికారి Captain Abbot తన లేఖలలో వివరంగా పేర్కొన్నాడు. ఆ లేఖ ప్రకారంగా '...ఒకడ్ని ఫిరంగులతో పేల్చివేశాం. ఆ దృశ్యం ఎంతో భయంకరంగా ఉంది. వాడి తల దాదాపు 20 గజాల పైకి ఎగిరింది. వాడి రెండు చేతులు రెండు వైపులకు దాదాపు ఎనిమిది

1857 ముస్లింలు.pdf

తిరుగుబాటు యోధుధాులను మూక్ముడిగా ఫిరంగులకుకట్టి పేల్చివేస్తున్న దృశ్యం.

గజాల దూరంలో పడ్డాయి...పట్టుబడ్డ ఖైదీలలో ఇద్దర్ని పేల్చివేశాం...ఇంకా మేము చేయాల్సిన ఇటువంటి పని ఎంతో ఉంది...' (నిజాం- బ్రిటిష్‌ సంబంధాలు, సరోజిని రెగాని, మీడియా హౌస్‌ పబ్లికేషన్స్‌, హైదారాబాద్‌, 2002, పేజి. 326).

తిరుగుబాటు యోధులను ఫిరంగులకు కట్టి పేల్చిన దృశ్యాలను ఆంగ్ల పత్రిక The Illustrated London News, 1857 August 22 నాటి సంచిక ఈ విధంగా వివరించింది: ముర్దాన్ లో నలభై మంది తిరుగుబాటుదారులను చంపిన తీరు చూడడానికి భయానకం. దోషుల కాళ్ళూ చేతులూ ఫిరంగి చక్రాలకు కట్టేసి వీపులు తుపాకి గొట్టాలకు

ఆన్చారు. పేలుడుకు శరీరం రెండు ముక్కలైంది. ఉన్నవి పది ఫిరంగులే కావడం వల్ల

215